రోజంతా ఎన‌ర్జిటిక్‌గా ఉండాలా? అయితే మార్నింగ్ మీరు దీన్ని తీసుకోండి!

రోజంతా ఎన‌ర్జిటిక్‌గా ఉండాల‌ని అంద‌రూ కోరుకుంటారు.కానీ, మ‌ధ్యాహ్నానికే నీర‌సం, అల‌స‌ట, చికాకు మొద‌ల‌వుతాయి.

 This Is A Morning Juice That Keeps The Body Energetic Throughout The Day! Energe-TeluguStop.com

దాంతో వ‌ర్క్ పై శ్ర‌ద్ధ వ‌హించ‌లేక తెగ సత‌మ‌తం అవుతుంటారు.అయితే ఇప్పుడు చెప్ప‌బోయే జ్యూస్‌ను మార్నింగ్‌ తీసుకుంటే రోజంతా ఎన‌ర్జిటిక్ గా ఉండొచ్చు.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ జ్యూస్ ఏంటో.దాన్ని ఎలా త‌యారు చేసుకోవాలో.

తెలుసుకుందాం ప‌దండీ.

ముందుగా ఒక క్యారెట్‌, ఒక బీట్ రూట్ ల‌ను తీసుకుని పీల్ తొల‌గించి నీటిలో శుభ్రంగా క‌డ‌గాలి.

ఇలా క‌డిగిన క్యారెట్, బీట్ రూట్ ల‌ను చిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.ఇప్పుడు బ్లెండ‌ర్ తీసుకుని అందులో బీట్ రూట్, క్యారెట్ ముక్క‌లు, ఒక క‌ప్పు దానిమ్మ గింజ‌లు, ఐదు పొట్టు తొల‌గించిన బాదం ప‌ప్పు, నాలుగు వాల్ న‌ట్స్‌, రెండు టేబుల్ స్పూన్ల తేనె, ఒక క‌ప్పు వాట‌ర్ వేసుకుని మెత్త‌గా గ్రైండ్ చేసుకుంటే సూప‌ర్ టేస్టీ అండ్ హెల్తీ క్యారెట్‌-బీట్‌రూట్‌-దానిమ్మ జ్యూస్ సిద్ధం అవుతుంది.

Telugu Beetroot, Carrot, Carrotbeetroot, Energetic, Tips, Latest, Pomegranate-Te

రెగ్యుల‌ర్ గా ఈ జ్యూస్‌ను ఒక గ్లాస్ చ‌ప్పున ఉద‌యం పూట తీసుకుంటే రోజంతా శ‌రీరం మ‌రియు మెడ‌దు ఎన‌ర్జిటిక్‌గా ఉండ‌టానికి అవ‌స‌రం శ‌క్తి ల‌భిస్తుంది.అంతేకాదు, ఈ జ్యూస్ ను తీసుకోవ‌డం వ‌ల్ల రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ సూప‌ర్ స్ట్రోంగ్ గా మారుతుంది.సీజ‌న‌ల్ వ్యాధులు ద‌రి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.ర‌క్త‌హీన‌త స‌మ‌స్య నుండి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.కంటి చూపు మెరుగు ప‌డుతుంది.బాడీలో పేరుకు పోయిన వ్య‌ర్థాలు, విషాలు తొల‌గిపోతాయి.

లివ‌ర్ శుభ్రంగా మారుతుంది.వృద్ధాప్య ల‌క్ష‌ణాలు త్వ‌ర‌గానే రాకుండా ఉంటాయి.

మ‌రియు చ‌ర్మం ఎల్ల‌ప్పుడూ య‌వ్వ‌నంగా, కాంతివంతంగా మెరుస్తుంది.కాబ‌ట్టి, పైన చెప్పిన హెల్తీ జ్యూస్ ను త‌ప్ప‌కుండా డైట్‌లో చేర్చుకునేందుకు ప్ర‌య‌త్నించండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube