డయేరియా రోగులను మంత్రి విడదల రజినీ పరామర్శ

గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరు గ్రామం లో డయేరియా లక్షణాలతో గ్రామం లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు జిల్లా పరిషత్ హై స్కూల్ లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాల్లో చికిత్స పొందుతున్న వారిని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని పరామర్శించారు.అధైర్య పడాల్సిన అవసరమేమీ లేదని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని రోగులకు మంత్రి రజిని భరోసానిచ్చారు.

 Rajini Paramarsha To Release The Diarrhea Patients , Rajini Paramarsha, Minister-TeluguStop.com

గ్రామంలోని త్రాగునీటిని పరీక్షలకు పంపించడం జరిగిందని, ప్రాథమిక రిపోర్టులో త్రాగు నీటిలో ఏవిధమైన దోషము లేదని తెలిసిందన్నారు.గ్రామంలో పరిస్థితి అదుపులో ఉందని,డయేరియా లక్షణాలతో మృతి చెందిన విద్యార్థిని మురికిపూడి శ్రీనిధి కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆ కుటుంబాన్నిఆర్థికంగా ఆదుకుంటామని మంత్రి విడుదల రజిని తెలియజేశారు.

జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ సబ్ కలెక్టర్ నిధి మినా పాల్గొన్నారు.బైట్ ః విడదల రజినీ,మంత్రి

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube