ఫోన్ లో ఎక్కువ మాట్లాడేవారికి అనారోగ్యం తప్పదా.....

ప్రస్తుత కాలంలో చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది.ఈ కాలంలో స్మార్ట్ ఫోన్ వల్ల కొన్ని పనులు వేగంగా జరుగుతూ ఉన్నా, ప్రజలకు స్మార్ట్ ఫోన్ వల్ల చాలా నష్టాలు కూడా జరుగుతూ ఉన్నాయి.

 Those Who Talk Too Much On The Phone Get Unhealthy Details, Mobile Phone, Talkin-TeluguStop.com

స్మార్ట్ ఫోన్ ఎంతవరకు ఉపయోగిస్తున్నారంటే దాదాపు 6 నెలల చిన్నపిల్లల నుంచి ముసలి వారి వరకు స్మార్ట్ ఫోన్ లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతున్నారు.దీనితో చిన్నతనం నుంచే పిల్లలలో చాలా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మనలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే సెల్ ఫోన్ ను మితిమీరి వాడడం వల్ల చర్మం దెబ్బతింటుందట.సెల్ ఫోన్ లో ఎక్కువ సేపు మాట్లాడడం వల్ల మొటిమలు, అలర్జీలు, చర్మం పై ముడతలు, నల్ల మచ్చలు, కళ్ల కింద నల్లటి వలయాలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది.

మొబైల్ పై సూక్ష్మ క్రిములు పేరుకుపోయి ఉండడం వల్ల చర్మంపై మొటిమలు వస్తాయి.ముఖానికి దగ్గరగా పెట్టుకుని మాట్లాడడం వల్ల ముఖానికి ఉన్న మేకప్, రాసుకున్న క్రీమ్, చెమట వంటివి స్మార్ట్ ఫోన్ స్క్రీన్ కు అంటుకుంటాయి.

Telugu Tips, Micro Organisms, Phone, Skin Problems, Skin Rashes, Unhealy-Telugu

అలాగే చాలా మందికి సెల్ ఫోన్ ను బాత్ రూమ్ లోకి తీసుకువెళ్లే అలవాటు కూడా ఉంటుంది.దీని వల్ల మొబైల్ పై ఎక్కువ సూక్ష్మ క్రిములు చేరే ప్రమాదం ఉంది.ఈ సమస్య బారిన పడకుండా ఉండాలంటే తరచూ మొబైల్ ఫోన్ ను శుభ్రం చేస్తూ ఉండాలి.40 శాతం ఆల్కహాల్ ఉన్న ద్రవ రూపంలోని క్లీనర్స్ తో మొబైల్ ను శుభ్రంగా ఉంచుకోవాలి.ఇయర్ ఫోన్స్ ను వాడితే మంచిది.మొబైల్ వాడడం వల్ల చెంపలపై దద్దుర్లు, అలర్జీలు వచ్చే అవకాశం కూడా ఉంది.ఎందుకంటే స్మార్ట్ ఫోన్ ల స్క్రీన్ లపై నికెల్, క్రోమియంలు ఉంటాయి.అందువల్ల వల్ల స్మార్ట్ ఫోన్లను ఉపయోగం ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగించాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube