వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలతో పాటు పర్యాటకం కోసం భారతీయులు( Indians ) ఈ మధ్యకాలంలో విదేశాలకు వెళ్తున్నారు.ఇందులో అమెరికా( America ) తొలి స్థానంలో వుంది.
అయితే ఇండియాలో రెండు కొత్త కాన్సులేట్ కార్యాలయాలను ప్రారంభించడం ద్వారా అగ్రరాజ్యానికి రానున్న రోజుల్లో భారతీయుల తాకిడి మరింత పెరిగే అవకాశం వుందని నిపుణులు అంటున్నారు.ప్రధాని నరేంద్ర మోడీ( Prime Minister Narendra Modi ) నాలుగు రోజుల పాటు అమెరికాలో పర్యటించిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు కొత్త మలుపు తిరిగాయి.భారతీయుల వీసాలను మరిన్ని ప్రాసెస్ చేసేందుకు అమెరికా అంగీకరించింది.
టూరిజం కన్సల్టెన్సీ ఐపీకే ఇంటర్నేషనల్ ప్రకారం.2022లో భారత్.ఆసియాలోనే అత్యధిక అంతర్జాతీయ ప్రయాణీకులున్న దేశంగా అవతరించింది.ఆ ఏడాది భారత్ నుంచి వచ్చిన అంతర్జాతీయ ప్రయాణీకులు ఆసియా దేశాలైన చైనా, దక్షిణ కొరియా, జపాన్‌లను మించిపోయారని ఐపీకే తెలిపింది.
యూఎస్ ట్రావెల్ అసోసియేషన్ సీఈవో జియోఫ్ ఫ్రిమాన్( CEO Geoff Freeman ) మాట్లాడుతూ.భారత్ వంటి కొత్త మార్కెట్లు తమ దేశ పర్యాటక రంగ వృద్ధికి దోహదం చేస్తాయన్నారు.
జో బైడెన్, నరేంద్ర మోడీల సంయుక్త ప్రకటన ప్రకారం.భారత్‌లోని బెంగళూరు, అహ్మదాబాద్ నగరాల్లో అమెరికా రెండు కొత్త కాన్సులేట్లను ప్రారంభించనుంది.
ఇరు దేశాల మధ్య వ్యాపారం , పర్యాటకం, వృత్తిపరమైన, సాంకేతిక మార్పిడి కోసం జరిగే ప్రయాణాలను సులభతరం చేయాలని ఇద్దరు నేతలు ఆకాంక్షించారు.
యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ కామర్స్ , నేషనల్ ట్రావెల్ అండ్ టూరిజం ఆఫీస్ డేటా ప్రకారం.2023లో మొదటి ఐదు నెలలు కరోనాకు ముందు భారత్ నుంచి అమెరికాకు వచ్చిన ప్రయాణీకుల కంటే ఎక్కువగా ప్రయాణం సాగించారట.కోవిడ్ తర్వాత అమెరికాకు చైనీయుల రాక బాగా తగ్గిందని గణాంకాలు చెబుతున్నాయి.యూఎస్‌ను సందర్శించే విదేశీ యాత్రికులలో భారత్ గతేడాది మూడో స్థానంలో నిలవగా.2019లో ఎనిమిదో స్థానం.అధికారిక గణాంకాలలో కెనడా, మెక్సికో సరిహద్దు దాటిన భారతీయుల డేటాను కలపలేదు.
భారత్‌లోని యూఎస్ ఎంబసీ, కాన్సులేట్‌లు 2019లో ఇదే సమయంలో జారీ చేసిన నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాల కంటే 2023లో ఇప్పటి వరకు ప్రాసెస్ చేసిన వీసాలు 44 శాతం ఎక్కువని విదేశాంగ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు.ఈ ఏడాది మిగిలిన సమయం కూడా ఆశాజనకంగానే వుందని ట్రావెల్ డేటా సంస్థ ఫార్వర్డ్ కీస్ చెబుతోంది.2023 చివరి త్రైమాసికంలో భారత్ నుంచి అమెరికాకు ఫ్లైట్ బుకింగ్స్ కరోనా ముందు నాటి కంటే 26 శాతం ఎక్కువ.కాగా.ఇటీవల శాన్‌ఫ్రాన్సిస్కో – ముంబై, శాన్‌ఫ్రాన్సిస్కో – బెంగళూరు మధ్య ఎయిరిండియా నాన్‌స్టాప్ సర్వీసును ప్రారంభించిన సంగతి తెలిసిందే.
.