హైదరాబాద్ నగరంలో రాబోయే 24 గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ హెచ్చరిక కేంద్రం తెలిపింది.దీంతో జీహెచ్ఎంసీ అధికారులు హైదరాబాద్ నగర వాసులను అప్రమత్తం చేశారు.
హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి పరిధిలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.ఈ నేపథ్యంలో ప్రజలు బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేసింది.
అదేవిధంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.