సామాన్యుల నుండి సెలబ్రిటీల ( Celebrities )వరకు అందరూ షూస్ ధరించడానికి ఇష్టపడతారని అందరికీ తెలిసిందే.అయితే షూస్ ధర వేలల్లో ఉంటుంది.
మహా అయితే క్రీడాకారులు, సెలబ్రిటీలు ధరించే షూస్( Shoes ) ధర లక్ష రూపాయల వరకు ఉండే అవకాశం ఉంది.కానీ పాదాలకు ధరించే షూస్ ధర ఏకంగా కోట్లల్లో ఉందంటే వినడానికి ఆశ్చర్యం అనిపిస్తుంది.
ఈ విషయం వింటే ముందుగా ఆ షూస్ వజ్ర వైడూర్యాలతో తయారు చేసి ఉంటారని అందరూ భావిస్తారు.కానీ వేలంలో కోట్ల రూపాయల ధర పలికిన షూస్ లో ఎటువంటి వజ్ర వైడూర్యాలు పొదగలేదు.
మరి ఆ షూస్ ఎందుకంత ఖరీదైనవో.వాటి ప్రత్యేకత ఏమిటో చూద్దాం.

1997 NBA ఫైనల్స్ 25వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వాహకులు వేలం నిర్వహించారు.చికాకో బుల్స్- ఊట జాజ్ ( Chicago Bulls- Oota Jazz )మధ్య జరిగిన మ్యాచ్ లో బాస్కెట్ బాల్ లెజెండ్ మైఖేల్ జోర్డాన్( Michael Jordan ) ధరించిన ఫ్లూ గేమ్ స్నీకర్ల కు వేలం నిర్వహించారు.ఈ వేలం లో ఆ షూస్ 1.38 బిలియన్ డాలర్ల ధర పలికాయి.మన భారత కరెన్సీలో రూ.11 కోట్లకు పై మాటే.

మైఖేల్ జోర్డాన్ కెరీర్ లో అత్యుత్తమ ఆటలలో ఈ ఫైనల్ మ్యాచ్ కూడా ఒకటి.ఈ ఫైనల్ మ్యాచ్ అనంతరం మైఖేల్ తన స్నీకర్లపై సంతకం చేసి వాటిని బాల్ బాయ్ ట్రూమాన్ కు బహుమతిగా ఇచ్చాడు.ఎందుకంటే మ్యాచ్ ప్రారంభానికి ముందు ట్రూమాన్ యాపిల్ సాస్ ను తెచ్చి మైఖేల్ కు ఇచ్చేవాడు. ట్రూమాన్ ప్రవర్తన మైఖేల్ కు నచ్చింది.అందుకే మైఖేల్ తన విలువైన షూస్ ని బహుమతిగా ఇచ్చాడు.ప్రస్తుతం ఆ షూస్ వేలంలో ఏకంగా కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి.







