కొంతమంది నటులకు ఎంత సంపాదించిన కూడా డబ్బులు మీద ఆశ ఉంటూనే ఉంటుంది.చేతినిండా ప్రాజెక్టులో ఉన్న కూడా ఇంత బిజీగా ఉన్నా కూడా డబ్బు కోసం వచ్చిన అవకాశం వదులుకోరు.
ఇప్పుడు శ్రీలీల( Sreeleela )కూడా అలాగే తయారైంది అని అంటున్నారు.తను కూడా డబ్బు మనిషి అంటూ ట్యాగ్ వేస్తున్నారు.
ఎన్ని అవకాశాలు వచ్చినా కూడా తనకు డబ్బులు సరిపోవట్లేదు అని అంటున్నారు.ఇంతకు అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.
ధమాకా( Dhamaka ) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఈ సినిమా తర్వాత పట్టిందల్లా బంగారం అన్నట్లుగా కనిపిస్తుంది.దర్శక నిర్మాతలే కాకుండా స్టార్ హీరోలు కూడా ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు ఇవ్వటానికి ముందుకు వస్తున్నారు.
ఇప్పటికే ఈ అమ్మడి ఖాతాలో వరుసగా దాదాపు 12 సినిమాలు ఉన్నాయని తెలిసింది.
అందులో టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలలోనే అవకాశాలు అందుకుంది.
ఇక ఈమెతో పాటు సీనియర్ హీరోయిన్స్ సెకండ్ హీరోయిన్స్ గా ఉంటున్నారు.ఇక ఇక్కడే అర్థమవుతుంది ఈ ముద్దుగుమ్మ క్రేజ్ ఏంటో అనేది.
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా శ్రీ లీల పేరు మారి మ్రోగిపోతుంది.దీంతో మిగతా స్టార్ హీరోయిన్స్ ఈ ముద్దుగుమ్మను చూసి కుళ్ళు కుంటున్నారని చెప్పాలి.
ఇక శ్రీ లీల క్రేజ్ ఎంత కాలం ఉంటుందో తెలియదు కానీ వరుస పెట్టి మాత్రం అవకాశాలు వస్తున్నాయి.ప్రస్తుతం పవన్ కళ్యాణ్, బాలయ్య, విజయ్ దేవరకొండ, నితిన్, రామ్, వైష్ణవ్ తేజ్, పవన్ కళ్యాణ్( Pawan kalyan ) వంటి స్టార్ హీరోలతో జత కట్టింది.ప్రస్తుతం ఈ సినిమాలు అన్ని షూటింగ్ బిజీగా ఉన్నాయి.మరికొన్ని త్వరలోనే ప్రారంభమవ్వనున్నాయి.
అయితే ఈ సినిమాలతో ఫుల్ బిజీగా ఉండి శ్రీ లీల.తో పాటు వచ్చిన అవకాశాలను కూడా కాదనకుండా ఓకే చేస్తుంది.అన్ని సినిమాలకు డేట్స్ ఇచ్చుకుంటూ పోతుంది.ఎక్కడ కూడా తీరిక లేకుండా సమయం మొత్తం బయట షూటింగ్లలోనే గడుపుతుంది.కాస్త ఖాళీ సమయం దొరికితే చాలు సోషల్ మీడియాలలో కనిపిస్తుంది.
ఇదంతా పక్కన పెడితే తాజాగా తను నీరుస్ క్లాత్ స్టోర్( Neeru Cloth Store ) కు సంబంధించి వీడియో పంచుకుంది.అందులో తను లేడీస్ కి సంబంధించిన డ్రెస్ ల గురించి ప్రమోట్ చేస్తూ కనిపించింది.ఇక అందులో తను వేసుకుని డ్రెస్ కూడా చాలా అందంగా కనిపించింది.
ఆ వీడియో చూసిన తన అభిమానులు బాగా లైక్స్ కొడుతుండగా కొంతమంది మాత్రం డబ్బుల కోసం వచ్చిన ప్రాజెక్టులన్ని చేసుకుంటూ పోతున్నావు అంటూ.ఇప్పటికే చేతినిండా డబ్బులు ఉన్నా కూడా మళ్లీ డబ్బుల కోసం ఇటువంటి అడ్వటైజ్మెంట్ లు కూడా చేస్తున్నావా అంటూ కామెంట్లు పెడుతున్నారు.
మొత్తానికి ఒక స్టార్ హీరోయిన్ కు ఉన్నంత క్రేజ్ అతి తక్కువ సమయంలో సొంతం చేసుకుందని చెప్పాలి.