కుటుంబ సంరక్షణ విధి నిర్వహణ బాధ్యతలతో ఎప్పుడూ బిజీగా ఉండే చాలామంది మహిళలు తమ ఆరోగ్య విషయాన్ని అసలు పట్టించుకోరు.ఫలితంగా అది మానసిక, శరీరక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.
అందుకే మహిళలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేందుకు శరీర ఆరోగ్యం( Health ) పట్ల ఎక్కువ శ్రద్ధ వహించాలి.కాబట్టి మహిళలు తమ ఆహారంలో మొత్తం ఆరోగ్యాన్ని పెంచే ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండాలి.
ముఖ్యంగా 30 ఏళ్ల తర్వాత రక్తహీనత, బలహీనత, ఎముకల బలహీనత( Weak Bones ), శక్తి లేకపోవడం, బరువు పెరగడం వంటి అనేక వ్యాధుల బారిన పడుతున్నారు.సంపూర్ణ ఆరోగ్యానికి పోషకాహారం అవసరం కాబట్టి మహిళలు తమ ఆహారంలో ఎక్కువ పోషకాలు ఆరోగ్యాన్ని పెంచే ఆహార పదార్థాలను తీసుకోవాలి.

ముఖ్యంగా చెప్పాలంటే విటమిన్ లేదా మినరల్ లోపం మహిళలను బలహీనపరుస్తుంది.దీంతో శరీరం బలహీనంగా మారుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.ఇది అలసట, చేతులు చల్లబడడం, కాళ్ళలో జలదరింపు, ఎముకలలో నొప్పి కలిగిస్తుంది.కొన్ని విటమిన్లు( Vitamins ) ఖనిజాల లోపాలు మహిళల ఆరోగ్యానికి ఎక్కువ ప్రమాదం కలిగిస్తాయి.
రక్తహీనత, బోలు ఎముకల వ్యాధి, యుటిఐ ప్రమాదం పెరుగుతుంది.ఇవన్నీ కొన్ని పోషకాల లోపానికి దారితీస్తాయి.
ఐరన్( Iron ), క్యాల్షియం, అయోడిన్, మెగ్నీషియం, పోలేట్ విటమిన్ లోపం మహిళల ఆరోగ్యాన్ని మరింత దిగజారేలా చేస్తుంది.దీన్ని తగ్గించుకోవాలంటే పోషకాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి.

మహిళలలో అయోడిన్ లోపం( Iodine deficiency ), గర్భస్రావం, ప్రసవ నెలలు నిండకుండానే ప్రసవానికి దారితీస్తుంది.దీని నుంచి బయటపడాలంటే ఉప్పు చేపలు, గుడ్లు, పాల ఉత్పత్తులు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.అలాగే రోజు నిమ్మకాయను కూడా ఉపయోగించాలి.ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది.నిమ్మకాయ జ్యూస్ కూడా తాగవచ్చు.మహిళలలో రక్తహీనతను నివారించడానికి దానిమ్మ గింజలు, పప్పులు, ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి.
అలాగే క్యాల్షియం లోపాన్ని నివారించడానికి గుమ్మడి గింజలు, బాదం( Badam ), బచ్చలి కూర, జీడిపప్పు, లాంటి పోషకాహారాలు తీసుకుంటూ ఉండాలి.అంతేకాకుండా యోగా, ధ్యానం, వాకింగ్ ఇతర వ్యాయామాలు చేయడం వల్ల ఒత్తిడి నియంత్రణలో ఉండి ఎప్పుడూ యవ్వనంగా కనిపిస్తారు.