క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ డైరెక్షన్ లో వచ్చిన ప్రతీ సినిమా ఒక ఆణిముత్యంలా ఉంటుంది.ఆయన డైరెక్షన్ లో గులాబీ, నిన్నే పెళ్లాడతా, సింధూరం, అంతఃపురం, ఖడ్గం ఇలా ఎన్నో అద్భుతమైన చిత్రాలు వచ్చాయి.
ఒక్కో సినిమా ఒక్కో లెవల్ లో ఉంటుంది.ఈయన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే, ఈయన డైరెక్ట్ చేసిన అంతఃపురం సినిమా మరొక ఎత్తు.1998 లో రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా తెలుగు చలనచిత్ర చరిత్రలో నిలిచిపోయింది.ఈ సినిమా డైరెక్టర్ గా కృష్ణవంశీకే కాదు, ఈ సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరికీ గుర్తింపు తెచ్చిపెట్టింది.
సౌందర్య, ప్రకాష్ రాజ్, జగపతిబాబు, సాయికుమార్ వంటి నటులకు అవార్డులు సైతం తెచ్చిపెట్టింది.ప్రకాష్ రాజ్ కు స్పెషల్ మెన్షన్ కేటగిరీలో నేషనల్ ఫిల్మ్ అవార్డ్ దక్కింది.
అలానే కృష్ణవంశీకి బెస్ట్ డైరెక్టర్ గా, సౌందర్యకు ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డులు దక్కాయి.అంతేకాదు ఉత్తమ సినిమాగా కూడా ఫిల్మ్ ఫేర్ అవార్డు దక్కించుకుంది ఈ సినిమా.
సౌందర్యకు స్పెషల్ జ్యూరీ అవార్డు, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా జగపతిబాబుకు, బెస్ట్ కేరెక్టర్ యాక్టర్ గా ప్రకాష్ రాజ్ కు, బెస్ట్ కేరెక్టర్ యాక్ట్రెస్ గా తెలంగాణ శకుంతలకు, బెస్ట్ ఫిమేల్ ప్లే బ్యాక్ సింగర్ గా ఎస్.జానకి గారికి, బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ గా శ్రీనివాసరాజు, బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ గా తోట సాయికి, సౌందర్య పాత్రకి డబ్బింగ్ చెప్పిన నటి సరితకు కూడా బెస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా నంది అవార్డులు వచ్చాయి.

యాక్టర్ గా నంది అవార్డు దక్కింది.ఈ సినిమాల్లో ఒక్కొక్కరి పాత్ర ఒక ఎత్తు అయితే, సౌందర్య కొడుకుగా నటించిన కృష్ణప్రదీప్ నటన మరొక ఎత్తు.ఈ సినిమా మొత్తం సౌందర్యతో పాటు ఒక చిన్న బాబు ఉంటాడు.ఈ సినిమాలో నటిస్తున్నప్పుడు ఆ బాబుకి రెండేళ్ళు మాత్రమే.రెండేళ్ల వయసులో కూడా చాలా బాగా నటించాడు.ముఖ్యంగా సౌందర్య స్పృహ కోల్పోయిన సమయంలో కర్చీఫ్ నీటిలో తడిపి తుడిచే సీన్ లో మాస్టర్ కృష్ణప్రదీప్ పెర్ఫార్మెన్స్ కి ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకున్నారు.
అంతలా కృష్ణప్రదీప్ ఆ పాత్రలో జీవించాడు.

ఆడుకోవడం, అల్లరి చేయడం తప్ప ఏమీ తెలియని వయసు.అలాంటిది ఆ వయసులో అది నటన, తాను చేసేది ఒక కేరెక్టర్ అని తెలుసుకోవడం, దానికి తగ్గట్టు అద్భుతంగా ఆ కేరెక్టర్ ని పండించడం అంటే మామూలు విషయం కాదు.రెండేళ్ల వయసులో తన నటనతో సత్తా చాటిన కృష్ణ ప్రదీప్ ఆ తర్వాత ఏ సినిమాలోనూ నటించలేదు.
చదువు నిర్లక్ష్యం కాకూడదని పేరెంట్స్ సినిమాలకి దూరం పెట్టారు.ఆ సినిమా వచ్చి 22 ఏళ్ళు అవుతుంది.ఇప్పుడు ఇతని వయసు 24 ఏళ్ళు.చూడ్డానికి సినిమా హీరోలా ఉన్నాడు.
హీరోగా చేయాలని భావిస్తున్న కృష్ణ ప్రదీప్, తనకు మొదట అవకాశం ఇచ్చిన కృష్ణవంశీనే నా గురువు అని చెప్పుకుంటారు.