ఎక్కువ శాతం మంది ముఖం పైనే శ్రద్ధ పెడతారు.ముఖాన్ని తెల్లగా, అందంగా మెరిపించుకోవడం కోసం రకరకాల క్రీమ్, సీరం లు వాడుతుంటారు.
అలాగే తరచూ బ్యూటీ పార్లర్ కి వెళ్లి ఫేషియల్ చేయించుకుంటూ ఉంటారు.కానీ మెడపై మాత్రం శ్రద్ధ పెట్టరు.
దీంతో డెడ్ స్కిన్ సెల్స్ పేరుకుపోవడం, హార్మోన్ చేంజ్, కాలుష్యం, శరీరంలో వేడి ఎక్కువ అవ్వడం, ఎండల ప్రభావం తదితర కారణాల వల్ల మెడ నల్లగా( Dark Neck ) మారుతుంటుంది.ఇక అప్పుడు హైరానా పడుతుంటారు.
ముఖం తో సంబంధం లేకుండా మెడ కనిపిస్తుంటే ఎంతగానో మదన పడుతుంటారు.ఈ సమస్య నుంచి బయటపడాలో తెలియక పిచ్చెక్కిపోతుంటారు.అయితే మెడ ఎంత నల్లగా ఉన్నా సరే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాను పాటిస్తే ఒక్క వాష్ లోనే తెల్లగా మారుతుంది.మరి ఇంకెందుకు లేటు ఆ సింపుల్ చిట్కా ఏంటో ఓ చూపు చూసేయండి.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి( Rice Powder ) వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు చార్కోల్ పౌడర్,( Charcoal Powder ) వన్ టేబుల్ స్పూన్ పెరుగు, హాఫ్ టేబుల్ స్పూన్ ఆముదం వేసుకొని మిక్స్ చేసుకోవాలి.చివరిగా రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు బంగాళదుంప జ్యూస్ కూడా వేసి అన్నీ కలిసేంతవరకు బాగా మిక్స్ చేయాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మెడకు కాస్త మందంగా అప్లై చేసుకోవాలి.

ఇరవై నిమిషాల పాటు మెడను డ్రై అవ్వనిచ్చి.అప్పుడు వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఈ సింపుల్ చిట్కాను పాటిస్తే ఒక్క వాష్ లోనే మెడ నలుపు చాలా వరకు వదిలిపోతుంది.ఇంకా నల్లగా ఉంది అనుకుంటే రెండు మూడు రోజులు ఈ చిట్కా ను ప్రయత్నించండి దాంతో మీ మెడ తెల్లగా మృదువుగా అందంగా మెరుస్తుంది.
అలాగే చాలామంది అండర్ ఆర్మ్స్( Under Arms ) డార్క్ గా ఉన్నాయని బాధపడుతూ ఉంటారు.అయితే ఈ సమస్యకు చెక్ పెట్టడానికి కూడా పైన చెప్పుకున్న రెమెడీ అద్భుతంగా సహాయపడుతుంది.