ఇటీవల కాలంలో హీరో హీరోయిన్లు ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు డైరెక్టర్, ప్రొడ్యూసర్ లుగా కూడా వ్యవహరిస్తున్నారు.ఒకరి తరువాత ఒకరు నిర్మాతలు డైరెక్టర్లుగా మారుతున్నారు.
తాజాగా కూడా ప్రముఖ స్టార్ డైరెక్టర్ మాజీ కోడలు కూడా నిర్మాతగా అవతారం ఎత్తింది.ఆమె ఎవరు ఏంటి అన్న వివరాల్లోకి వెళితే.
టాలీవుడ్ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ( Raghavendra Rao )మాజీ కోడలు కనికా ధిల్లాన్( Kanika Dhillon ) నిర్మాతగా అవతారమెత్తింది.అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి రచయితగా మారిన ఆమె గతేడాది రిలీజ్ అయిన ఏక్ విలన్ రిటర్న్స్, రక్షా బంధన్‌లకు తనే స్వయంగా కథ అందించింది.

ఇప్పుడు ఏకంగా షారుక్ ఖాన్( Shahrukh Khan ) నటిస్తున్న డుంకీ సినిమాకు కూడా తనే కథ అందించడం విశేషం.రచయితగా సత్తా చాటుతున్న ఆమె తాజాగా ప్రొడక్షన్ వైపు అడుగులు వేసింది.కథా పిక్చర్స్( Katha Pictures ) అనే బ్యానర్‌ను ప్రారంభించింది.తన తొలి ప్రాజెక్ట్‌ను దో పట్టి అని ప్రకటించింది.ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించింది.కథా పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించినందుకు ఎంతో సంతోషంగా ఉంది.
కాజోల్, కృతీ సనన్ వంటి ప్రతిభగల హీరోయిన్లతో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది అని ట్విటర్‌లో రాసుకొచ్చింది కనిక.

ప్రస్తుతం అందుకు సంబంధించిన ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.రాఘవేంద్రరావు తనయుడు, డైరెక్టర్ ప్రకాశ్ కోవెలమూడి- కనికా ధిల్లాన్ 2014లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు.2017లోనే వీరిద్దరూ విడిపోగా 2019లో వచ్చిన జడ్జిమెంటల్ హై క్యా చిత్రానికి కలిసి పని చేశారు.ఈ చిత్రానికి ప్రకాశ్ దర్శకత్వం వహించగా కనికా కథా సహకారం అందించింది.ఆ తర్వాత వీరు విడాకులు తీసుకున్నారు.తర్వాత కనికా ధిల్లాన్ స్క్రీన్ రైటర్ హిమాన్షుతో ప్రేమలో పడగా 2021 ఆరంభంలో పెళ్లి చేసుకున్నారు.కాగా రాజ్ కుమార్ రావు అనగనగా ఓ ధీరుడు అనే ఫాంటసీ చిత్రాన్ని తీసి ప్రకాష్ చేతులు కాల్చుకున్నాడు.







