గాడ్‌ ఫాదర్‌, ది ఘోస్ట్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అక్కడ జరగడం వెనుక అంత విషయం ఉందా!

మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ మరియు నాగార్జున నటించిన ది ఘోస్ట్ సినిమాలు దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.ఈ రెండు సినిమాలు కూడా అక్టోబర్ 5వ తారీఖున విడుదల కాబోతున్నాయి.

 Why The Ghost And God Father Movies Pre Release Events Happen In Ap , Ap News, G-TeluguStop.com

అదే విధంగా ఈ రెండు సినిమాలకు ఫ్రీ రిలీజ్ ఈవెంట్లు ఏపీలోనే జరిగాయి.ఎప్పుడు లేని విధంగా గాడ్ ఫాదర్ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అనంతపురంలో జరగగా కర్నూలులో నాగార్జున సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.

ఈ ఇద్దరు హీరోలు తమ సినిమాల యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్లు ఏపీలో ఎందుకు నిర్వహించారు అంటూ ఇప్పుడు ఆసక్తికరంగా చర్చ జరుగుతుంది.సాధారణంగా సినిమా ఫంక్షన్స్ అన్నీ కూడా హైదరాబాదులో జరుగుతాయి.

మీడియా వారు రావడానికి మరియు స్పెషల్ అతిథులు రావడానికి వీలుగా హైదరాబాద్ ఉంటుంది.

మరి ఈ రెండు సినిమాలకు ఎందుకు ఆంధ్రప్రదేశ్ లో ఫంక్షన్స్ చేశారు అనేది చర్చనీయాంశంగా మారింది.ఆ విషయంలో కొందరు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు.అవేంటంటే.

ఆ మధ్య ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టికెట్ల రేట్ల పెంపు విషయమై కలిసిన సందర్భంగా సినిమా ఇండస్ట్రీకి చెందిన ఫంక్షన్స్ ఏపీలో నిర్వహించాలని కండిషన్ పెట్టాడట.ఆ కండిషన్ కారణంగానే చిరంజీవి మరియు నాగార్జునలు తమ సినిమాల యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ అక్కడ జరిపారంటూ సమాచారం అందుతోంది.

ఇండస్ట్రీ కోసం సీఎం జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన హామీ మేరకు కాస్త ఇబ్బంది అయినా కూడా అక్కడ ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ జరిపారని సమాచారం అందుతుంది.ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డిని సంతృప్తి పరచడం కోసం చిరంజీవి మరియు నాగార్జున లు అక్కడ ఈవెంట్స్ చేశారు.

మరి ఇతర హీరోలు కూడా ఏపీ లో తమ సినిమాల యొక్క ఫంక్షన్ నిర్వహిస్తారా అనేది చూడాలి.

Video : Why The Ghost And God Father Movies Pre Release Events Happen In Ap , Ap News, God Father, Movie News, Telugu News, The Ghost, Ys Jagan #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube