సాధారణంగా బాహ్య ప్రపంచంలో మహిళలు మరియు చిన్న పిల్లలు లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్న సంఘటనలను మనము చూస్తుంటాం మరియు వింటుంటాం.కానీ కొన్ని చోట్లయితే దారుణంగా ఏకంగా కుటుంబ సభ్యులే చిన్నపిల్లలపై లైంగిక దాడికి పాల్పడిన ఘటనలు ప్రస్తుత కాలంలో రోజురోజుకు ఎక్కువవుతున్నాయి.
దీంతో ప్రస్తుత సమాజంలో ఆడ పిల్లలు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అనే సందిగ్ధంలో బ్రతుకుతున్నారు.
తాజాగా బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ తమ్ముడిపై తనకు వరుస కు కూతురయ్యే యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దీంతో ఈ విషయం ప్రస్తుతం సినీ పరిశ్రమలో కోడై కూస్తోంది.
వివరాల్లోకి వెళితే బాలీవుడ్ ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖి కి జమీనా అనే యువతి వరుసకు కూతురు అవుతుంది.
అయితే అప్పట్లో నవాజుద్దీన్ సిద్దిఖీ తమ్ముడు జమీనా ను ప్రేమగా దగ్గరకు తీసుకునే నెపంతో పలుమార్లు లైంగిక హింసకు పాల్పడ్డాడని, దీంతో అప్పట్లో తన చిన్నాన్న దగ్గరికి వెళ్లాలంటే భయంగా ఉండేదని చెప్పుకొచ్చింది.
అయితే తనపై తన చిన్నాన్న లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు పలుమార్లు తన పెదనాన్న నవాజుద్దీన్ సిద్దిఖీ కి చెప్పినప్పటికీ అతడు మాత్రం చాలా సింపుల్ గా మీ చిన్నాన్న అలా ఎప్పటికీ చేయడని అంటుండేవాడని దాంతో తన బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియక తనలో తానే కుమిలిపోయే దానిని ఆవేదన వ్యక్తం చేసింది.
ఇప్పుడు పెళ్లయిన తర్వాత కూడా తనని ఉద్దేశపూర్వకంగానే కష్టాలపాలు చేస్తున్నాడని తెలిపింది.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియా మాధ్యమాల్లో తెగ రల్ అవైవుతోంది.
అంతేగాక తాజాగా ఈ ఫిర్యాదు విషయంపై నవాజుద్దీన్ సిద్ధిఖి భార్య ఆలియా కూడా స్పందించింది.ఇందులో భాగంగా నవాజుద్దీన్ సిద్దిఖీ పై పలు సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఇందులో ఇది కేవలం ఆరంభం మాత్రమేనని అంతేకాక ఇప్పుడు చూద్దాం నిజాన్ని ఎంత రేటు పెట్టి కొంటారో అంటూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.ఇటీవలే ఆలియా కూడా నవాజుద్దీన్ సిద్దిఖీతో విడాకులు తీసుకోవాలని నోటీసులు కూడా పంపించింది.