ప్రభుత్వ ప్రణాళిక.. ప్రజల సహకారం, ఫలితం ‘‘జీరో డెత్స్’’: ఆంక్షల ఎత్తివేతకు యూకే రెడీ

కరోనా మహమ్మారి వల్ల అష్టకష్టాలు పడిన దేశాల్లో బ్రిటన్ ఒకటి.ప్రతిరోజూ లక్షల సంఖ్యలో కేసులు, మరణాలతో యూకే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది.

 Zero Daily Covid Deaths Reported In England Northern Ireland And Scotland, Pfize-TeluguStop.com

ఆ తర్వాత వైరస్ వ్యాప్తి నెమ్మదించడంతో ఊపిరి పీల్చుకుంది.కానీ తిరిగి డిసెంబర్, జనవరి నెలల్లో సెకండ్ వేవ్ విజృంభించడంతో పాటు కొత్త రకం స్ట్రెయిన్‌తో బ్రిటన్ వణికిపోయింది.

దీంతో డిసెంబర్‌లో యూకేలో లాక్‌డౌన్ విధించారు.కొత్త రకం కోవిడ్‌ ఒకరి నుంచి ఒకరికి సులభంగా వ్యాపిస్తోందని యూకే ప్రభుత్వం గుర్తించింది.

నవంబరులో మూడోసారి నాలుగు వారాల లాక్‌డౌన్ విధించిన బ్రిటన్.డిసెంబరు మొదటి వారంలో ఆంక్షలు సడలించింది.కానీ, పరిస్థితి అదుపుతప్పుతుందని భావించి మళ్లీ లాక్‌డౌన్ ప్రకటించారు.

ఇదే సమయంలో వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం కఠినమైన ఆంక్షలను అమలు చేసింది.

దీనితో పాటు వ్యాక్సినేషన్‌కు పెద్ద పీట వేసింది.దీని వల్లే కోవిడ్ వెలుగు చూసిన తర్వాత తొలిసారిగా జీరో మరణాలు నమోదయ్యాయి.

స్కాట్లాండ్, ఉత్తర ఐర్లాండ్‌లలో కూడా ఎటువంటి మరణాలు నమోదు కాలేదని ఫోర్బ్స్ పత్రిక పేర్కొంది.అయితే ఇది చూసి నిర్లక్ష్యం పనికిరాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వ్యాక్సినేషన్‌తో పాటు లాక్‌డౌన్ వల్లే ఇది సాధ్యమైందని అధికారులు చెబుతున్నారు.ఈ క్రమంలో యూకేలో ఆంక్షలను సడలించాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఆరుగురు వ్యక్తులు, రెండు కుటుంబాలు కలుసుకునేందుకు మే 17 నుంచి అనుమతించింది.కాగా ఆస్ట్రాజెనెకా టీకా సింగిల్ డోసు తీసుకున్న వారిలో ప్రాణాపాయం 80 శాతం వరకు తగ్గిందని ఇంగ్లాండ్ పబ్లిక్ హెల్త్ విభాగం జరిపిన అధ్యయనంలో తేలింది.

ఇక ఫైజర్ సింగిల్ డోసు అనంతరం 80 శాతం రక్షణ లభిస్తుండగా.రెండు డోసులు తీసుకున్న వారిలో 97 శాతం ముప్పు తగ్గుతోందని అధికారులు తెలిపారు.

Telugu Forbes Magazine, Boris Johnson, Modernna, Scotland-Telugu NRI

కాగా దేశంలో 50 ఏళ్ళు దాటిన వారందరికీ మూడో వ్యాక్సిన్ ఇవ్వాలని బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.క్రిస్మస్ నాటికి దేశంలో కోవిడ్ నిర్మూలన జరగాలని బోరిస్ జాన్సన్ ప్రభుత్వం భావిస్తోంది.బ్రిటన్‌లో వ్యాక్సినేషన్ కోసం ఫైజర్ బయో ఎన్ టెక్, ఆక్స్ ఫర్డ్ ఆస్ట్రాజెనికా, మోడెర్నా వ్యాక్సిన్లను వినియోగిస్తున్నారు.దేశంలో ఇప్పటి వరకు 36.6 మిలియన్ల మంది వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.అయితే 510 మిలియన్లకు పైగా కోవిడ్ డోసులను ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube