సూర్యాపేట జిల్లా( Suryapet District ):వర్షా కాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని,అన్ని శాఖల అధికారులు నీటి సరఫరా,పారిశుద్ధ్యం,విద్యుత్ సరఫరా విషయంలో జాగ్రతలు తీసుకోవాలని సూర్యాపేట జిల్లా నడిగూడెం ఎంపీపీ యాతాకులు జ్యోతి( MPP Yatakulu Jyoti ) అన్నారు.గురువారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాబోయే వర్షాలకు పైప్ లైన్లు లీకై అపరిశుభ్ర నీరు తాగడం మూలంగా వాంతులు, విరోచనాలయ్యే అవకాశం ఉన్నందున అధికారులు తగు చర్యలను చేపట్టాలని,అదే విధంగా దోమల నివారణ కోసం చిన్న చిన్న నీటి గుంటలను పూడ్చి వేసి,నీటి నిల్వలు లేకుండా చేయాలని, మురుగు కాలువలను శుభ్రపరచాలని ఆదేశించారు.
ఏదైనా ఇబ్బందికర పరిస్థితుల్లో వైద్య,ఆరోగ్య శాఖ,( Medical and Health Department, )అలాగే వివిధ శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ హేమమాలిని,ఎంపీడీవో హిమం,ఎంపీటీసీ గుండు శ్రీనివాస్,వైద్యాధికారులు, కార్యదర్శులు,స్పెషల్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.