1.తెలంగాణ లో ఒమి క్రాన్ BA తొలి కేసు నమోదు
![Telugu Chandrababu, Jagan Davos, Janasenapawan, Ktr, Lokesh, Narendramodi, Somu Telugu Chandrababu, Jagan Davos, Janasenapawan, Ktr, Lokesh, Narendramodi, Somu](https://telugustop.com/wp-content/uploads/2022/05/first-omicron-ba-case-registered-in-telangana.jpg )
దక్షిణాఫ్రికా దేశాలలో వ్యాప్తిచెందిన ఒమి క్రాన్ సబ్ వేరియంట్లు బీఏ .4, బీఏ .5 లు భారత్ లో గుర్తించినట్లు ఇండియన్ సార్స్ – కోవ్ -2 జీనో మిక్స్ కన్సర్టీఎం స్పష్టం చేసింది.తెలంగాణ, తమిళనాడులో ఈ కేసులు బయటపడినట్లు తెలిపింది.
2.తెలంగాణలో ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు
తెలంగాణలో పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి.జూన్ 1 వరకు పరీక్షలు జరగనున్నాయి.
3.షర్మిల కామెంట్స్
![Telugu Chandrababu, Jagan Davos, Janasenapawan, Ktr, Lokesh, Narendramodi, Somu Telugu Chandrababu, Jagan Davos, Janasenapawan, Ktr, Lokesh, Narendramodi, Somu](https://telugustop.com/wp-content/uploads/2022/05/ys-sharmila-fires-on-cm-kcr-1.jpg )
పంజాబ్ రైతులకు పంచడానికి తెలంగాణ సొమ్ము ఏమైనా మీ తాత జాగీరా అని తెలంగాణ సీఎం కేసీఆర్ పై వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల విమర్శలు చేశారు.
4.పవన్ ను సీఎం చేయడమే లక్ష్యం
పవన్ కళ్యాణ్ ను సీఎం చేయడమే ఏకైక లక్ష్యం అని అఖిలభారత మెగా అభిమానుల ఆత్మీయ కలయిక సందర్భంగా తీర్మానించారు.
5.స్విర్జర్ లాండ్ చేరుకున్న కేటీఆర్
![Telugu Chandrababu, Jagan Davos, Janasenapawan, Ktr, Lokesh, Narendramodi, Somu Telugu Chandrababu, Jagan Davos, Janasenapawan, Ktr, Lokesh, Narendramodi, Somu](https://telugustop.com/wp-content/uploads/2022/05/minister-ktr-reached-switzerland.jpg )
తెలంగాణ మంత్రి కేటీఆర్ నాలుగు రోజుల పర్యటనలో భాగంగా స్విర్జర్ లాండ్ చేరుకున్నారు.
6.‘ రేపటి మనిషి ‘ పుస్తకావిష్కరణ
రాజకీయ విశ్లేషకుడు మనస్తత్వ నిపుణుడు నరసింహారావు సంస్మరణ సభ సందర్భంగా ఆయన మిత్రులు రూపొందించిన ‘ రేపటి మనిషి ‘ పుస్తకాన్ని ఆయన కుటుంబ సభ్యులు ఆవిష్కరించారు.
7.పోలీస్ ఉద్యోగాలకు 12 లక్షల దరఖాస్తులు
![Telugu Chandrababu, Jagan Davos, Janasenapawan, Ktr, Lokesh, Narendramodi, Somu Telugu Chandrababu, Jagan Davos, Janasenapawan, Ktr, Lokesh, Narendramodi, Somu](https://telugustop.com/wp-content/uploads/2022/05/12lakh-applications-for-telangana-police-jobs.jpg )
2 ఏళ్ల వయోపరిమితి పెంపు తో పోలీస్ పోస్టులకు 12 దరఖాస్తులు అందినట్లు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది.
8.ఇంటర్న్ షిప్ కు ఫీజు వసూలు చేయొద్దు
ఇంటర్న్ షిప్ కోసం వైద్య విద్యార్థుల నుంచి ప్రైవేటు వైద్య విద్యా కళాశాలలు వైద్య పరిశోధన సంస్థలు ఫీజులు వసూలు చేయొద్దని ఎన్ ఎం సీ అన్ని రాష్ట్రాలకు సర్కులర్ విడుదల చేసింది.
9.వీర్రాజు సవాల్
![Telugu Chandrababu, Jagan Davos, Janasenapawan, Ktr, Lokesh, Narendramodi, Somu Telugu Chandrababu, Jagan Davos, Janasenapawan, Ktr, Lokesh, Narendramodi, Somu](https://telugustop.com/wp-content/uploads/2022/05/somu-veerraju-challenges-minister-botsa.jpg )
ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణకు బిజెపి ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సవాల్ విసిరారు.ఏపీ ని అభివృద్ధి చేసింది కేంద్రమైనని అన్నారు.దమ్ముంటే ఏపీ అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు.
10.ఎంపీ రఘురామ అనర్హత పిటిషన్ పై ప్రివిలేజ్ కమిటీ విచారణ
![Telugu Chandrababu, Jagan Davos, Janasenapawan, Ktr, Lokesh, Narendramodi, Somu Telugu Chandrababu, Jagan Davos, Janasenapawan, Ktr, Lokesh, Narendramodi, Somu](https://telugustop.com/wp-content/uploads/2022/05/mp-raghurama-privilage-committee.jpg )
ఎంపీ రఘురామకృష్ణంరాజు అనర్హత పిటిషన్ పై లోక్ సభ ప్రివిలేజ్ కమిటీ విచారణ నిర్వహించింది.
11.ఋషికొండ తవ్వకాలపై సుప్రీం కోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం
రుషికొండ తవ్వకాలపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.విశాఖలో రుషికొండ తవ్వకాలపై ఎన్జీటి ధర్మాసనం స్టే విధించింది.ఎన్జీటి ఆదేశాలను ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది.
12.జగన్ పర్యటనపై లోకేష్ కామెంట్స్
![Telugu Chandrababu, Jagan Davos, Janasenapawan, Ktr, Lokesh, Narendramodi, Somu Telugu Chandrababu, Jagan Davos, Janasenapawan, Ktr, Lokesh, Narendramodi, Somu](https://telugustop.com/wp-content/uploads/2022/05/nara-lokesh-comments-on-jagan-davos-tour.jpg )
సీఎం జగన్ దావోస్ పర్యటన పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శలు చేశారు.జగన్ పెట్టుబడుల కోసం వెళ్లినట్టు లేదని , అక్కడ వైసీపీ నేతలు మీటింగ్ జరుగుతున్నట్లు గా ఉందని విమర్శించారు.
13.బిజెపి ముఖ్య నేతల సమావేశం
తెలంగాణలో నేడు బిజెపి ముఖ్య నేతల సమావేశం జరిగింది ఈ సమావేశానికి బిజెపి వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్, జాతీయ సంస్థాగత సహాయ ప్రధాన కార్యదర్శి శివ ప్రకాష్ హాజరయ్యారు.
14.నేటి నుంచి కోనసీమ లో 144 సెక్షన్
![Telugu Chandrababu, Jagan Davos, Janasenapawan, Ktr, Lokesh, Narendramodi, Somu Telugu Chandrababu, Jagan Davos, Janasenapawan, Ktr, Lokesh, Narendramodi, Somu](https://telugustop.com/wp-content/uploads/2022/05/144-section-in-konaseema.jpg )
కోనసీమ జిల్లాలో నేటి నుంచి వారం రోజుల పాటు 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి తెలిపారు.
15.టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం
ఈ నెల 26 వ తేదీన టిడిపి పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది.
16.ఈ నెల 25 న భారత్ బంద్
![Telugu Chandrababu, Jagan Davos, Janasenapawan, Ktr, Lokesh, Narendramodi, Somu Telugu Chandrababu, Jagan Davos, Janasenapawan, Ktr, Lokesh, Narendramodi, Somu](https://telugustop.com/wp-content/uploads/2022/05/bharat-bandh-on-may-25.jpg )
ఈ నెల 25న భారత్ బంద్ కు ఆలిండియా బ్యాక్ వార్డ్ అండ్ మైనారిటీ కమ్యూనిటీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ పిలుపునిచ్చింది.
17.కోర్టు కు హాజరైన నారా లోకేష్
జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విజయవాడ అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టుకు హాజరయ్యారు.2020లో అచ్చెన్నాయుడు అరెస్ట్ సమయంలో ఆయనకు మద్దతుగా ఏసీబీ కోర్టు వద్దకు లోకేష్ వచ్చారు.అయితే అప్పుడు నిబంధనలు ఉల్లంఘించారని లోకేష్ పై కేసు నమోదైంది.
18.నేడు రేపు జపాన్ లో ప్రధాని మోదీ పర్యటన
![Telugu Chandrababu, Jagan Davos, Janasenapawan, Ktr, Lokesh, Narendramodi, Somu Telugu Chandrababu, Jagan Davos, Janasenapawan, Ktr, Lokesh, Narendramodi, Somu](https://telugustop.com/wp-content/uploads/2022/05/modi-japan-tour.jpg )
నేడు , రేపు భారత ప్రధాని నరేంద్ర మోది జపాన్ లో పర్యటించనున్నారు.
19.మహిళా ఛాలెంజర్ టీ 20 టోర్నీ
నుంచి మహిళా చాలెంజర్ టి20 టోర్నీ ప్రారంభం కానుంది.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 47,150 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 51,430
.