ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్‌ను చేప‌ల ద్వారానే కాదు..ఇలా కూడా పొందొచ్చ‌ట‌!

మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే అతి ముఖ్య‌మైన పోష‌కాల్లో ఒమెగా – 3 ఫ్యాటీ యాసిడ్స్ ముందు వ‌ర‌స‌లో ఉంటాయి.గుండె ఆరోగ్యంగా, దృఢంగా ఉండాల‌న్నా, రోగ నిరోధ‌క శ‌క్తి పెర‌గాల‌న్నా, వృద్ధాప్య ఛాయ‌లు ద‌రి చేర‌కూడ‌ద‌న్నా, ఎముక‌లు బ‌లంగా మారాల‌న్నా, ఊపిరితిత్తులు ఆరోగ్యాంగా ప‌ని చేయాల‌న్నా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎంతో అవ‌స‌రం.

 Sources Of Omega 3 In Vegetarian Diet! Sources Of Omega 3, Vegetarian Diet, Omeg-TeluguStop.com

అందుకే వైద్య నిపుణులు వారానికి రెండు సార్లు చేప‌లు తిన‌మ‌ని సూచిస్తుంటారు.ఎందుకంటే, చేప‌ల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్క‌లంగా ఉంటాయి.

అయితే శాకాహారులు చేప‌లు తిన‌రు.ఇలాంటి వారు ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ ను తీసుకోవ‌డాన్ని పెద్ద స‌వాల్‌గా భావిస్తుంటారు.ఏ ఏ ఆహారాలు తినాలో తెలియ‌క తెగ స‌త‌మ‌త‌మ‌వుతుంటారు.అయితే నిజానికి చేప‌ల్లోనే కాదు.

ఇప్పుడు చెప్ప‌బోయే ఆహారాల్లోనూ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్క‌లంగా ఉంటాయి.మ‌రి లేటెందుకు ఆ ఆహారాలు ఏంటో చూసేయండి.

Telugu Tips, Latest, Omegafatty, Omega, Vegetarian Diet, Vegetarians-Telugu Heal

చియా సిడ్స్‌..ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ కు గొప్ప మూలం అని చెప్పుకోవ‌చ్చు.అవును, రోజూ ఉద‌యాన్నే గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో అర స్పూన్ చియా విత్త‌నాలు క‌లిపి సేవిస్తే శ‌రీరానికి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అద్భుతంగా అందుతాయి.

అలాగే వాల్ నట్స్‌లోనూ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి.అందు వ‌ల్ల శాకాహారులు ప్ర‌తి రోజూ గుప్పెడు వాల్ న‌ట్స్ తింటే చాలా మంచిది.

అవిసె గింజల్లోనూ ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ స‌మృద్ధిగా నిండి ఉంటాయి.కాబ‌ట్టి, అవిసె గింజ‌ల‌ను రోజూ ఏదో ఒక రూపంలో తీసుకుంటే శ‌రీరంలో ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ కొర‌త ఏర్ప‌డ‌కుండా ఉంటుంది.

ఇక ఇవే కాకుండా ఆవ నూనె, సోయా బీన్ నూనె, రాజ్మా, పాల‌కూర‌, అవ‌కాడో పండు, గుడ్డు వంటి వాటిల్లోనూ ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి.సో.వీటిని డైట్‌లో చేర్చుకుంటే మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube