ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్‌ను చేప‌ల ద్వారానే కాదు..ఇలా కూడా పొందొచ్చ‌ట‌!

మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే అతి ముఖ్య‌మైన పోష‌కాల్లో ఒమెగా - 3 ఫ్యాటీ యాసిడ్స్ ముందు వ‌ర‌స‌లో ఉంటాయి.

గుండె ఆరోగ్యంగా, దృఢంగా ఉండాల‌న్నా, రోగ నిరోధ‌క శ‌క్తి పెర‌గాల‌న్నా, వృద్ధాప్య ఛాయ‌లు ద‌రి చేర‌కూడ‌ద‌న్నా, ఎముక‌లు బ‌లంగా మారాల‌న్నా, ఊపిరితిత్తులు ఆరోగ్యాంగా ప‌ని చేయాల‌న్నా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎంతో అవ‌స‌రం.

అందుకే వైద్య నిపుణులు వారానికి రెండు సార్లు చేప‌లు తిన‌మ‌ని సూచిస్తుంటారు.ఎందుకంటే, చేప‌ల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్క‌లంగా ఉంటాయి.

అయితే శాకాహారులు చేప‌లు తిన‌రు.ఇలాంటి వారు ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ ను తీసుకోవ‌డాన్ని పెద్ద స‌వాల్‌గా భావిస్తుంటారు.

ఏ ఏ ఆహారాలు తినాలో తెలియ‌క తెగ స‌త‌మ‌త‌మ‌వుతుంటారు.అయితే నిజానికి చేప‌ల్లోనే కాదు.

ఇప్పుడు చెప్ప‌బోయే ఆహారాల్లోనూ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్క‌లంగా ఉంటాయి.మ‌రి లేటెందుకు ఆ ఆహారాలు ఏంటో చూసేయండి.

"""/"/ చియా సిడ్స్‌.ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ కు గొప్ప మూలం అని చెప్పుకోవ‌చ్చు.

అవును, రోజూ ఉద‌యాన్నే గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో అర స్పూన్ చియా విత్త‌నాలు క‌లిపి సేవిస్తే శ‌రీరానికి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అద్భుతంగా అందుతాయి.

అలాగే వాల్ నట్స్‌లోనూ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి.అందు వ‌ల్ల శాకాహారులు ప్ర‌తి రోజూ గుప్పెడు వాల్ న‌ట్స్ తింటే చాలా మంచిది.

అవిసె గింజల్లోనూ ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ స‌మృద్ధిగా నిండి ఉంటాయి.కాబ‌ట్టి, అవిసె గింజ‌ల‌ను రోజూ ఏదో ఒక రూపంలో తీసుకుంటే శ‌రీరంలో ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ కొర‌త ఏర్ప‌డ‌కుండా ఉంటుంది.

ఇక ఇవే కాకుండా ఆవ నూనె, సోయా బీన్ నూనె, రాజ్మా, పాల‌కూర‌, అవ‌కాడో పండు, గుడ్డు వంటి వాటిల్లోనూ ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి.

సో.వీటిని డైట్‌లో చేర్చుకుంటే మంచిది.

అమీర్ ఖాన్ కొత్త సినిమా వచ్చేది అప్పుడేనా..?మన హీరోలను చూసి భయపడుతున్నాడా..?