ప్రసవం తర్వాత త్వరగా రికవరీ అవ్వాలంటే ఈ ఆహారాలు కచ్చితంగా డైట్ లో ఉండాల్సిందే!

ఆడవారికి ప్రసవం అనేది మరో పునర్జన్మ అంటారు.అయితే ప్రసవం మాత్రమే కాదు ప్రసవానంతరం కూడా మహిళలకు అత్యంత కష్టతరమైన సమయం.

 Best Foods For Quick Recovery After Delivery! Women, Latest News, Health, Health-TeluguStop.com

డెలివరీ అనంతరం మహిళలు శారీరకంగా, మానసికంగా ఎన్నో సమస్యలను ఫేస్ చేస్తూ ఉంటారు.ఆ సమయంలో త్వరగా రికవరీ అవ్వాలంటే ఖచ్చితంగా కొన్ని కొన్ని ఆహారాలు డైట్ లో ఉండేలా చూసుకోవాలి.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఆహారాలు ఏంటో తెలుసుకుందాం పదండి.

Telugu Delivery, Tips, Latest, Recovery Foods-Telugu Health

ప్రసవం( Delivery ) అనంతరం బాలింతలు త్వరగా జీర్ణం అయ్యే బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి.అప్పుడే బిడ్డకు కావాల్సినంత పాలు ఉత్ప‌త్తి అవుతాయి.అలాగే తల్లులు త్వరగా రికవరీ అవుతారు.

అందుకోసం ముఖ్యంగా రోజుకు రెండు నుంచి మూడు గ్లాసుల పాలు తాగాలి.అలాగే నెయ్యిని ఖ‌చ్చితంగా మూడు పూట్లా తీసుకోవాలి.

సొరకాయ, బీరకాయ, పొట్లకాయ, బీట్ రూట్, క్యారెట్, బెండకాయ, కాకరకాయ వంటి కూరగాయలతో పాటు ఆకుకూరల‌ను అధికంగా తీసుకోవాలి.ప్రసవం అనంతరం పండ్లు తినకూడదని కొందరు చెబుతుంటారు.

కానీ ఇది అపోహ మాత్రమే.యాపిల్, దానిమ్మ, బొప్పాయి వంటి పండ్లను ఎలాంటి భ‌యం పెట్టుకోకుండా తీసుకోవచ్చు.

డెలివరీ అనంతరం రోజుకు ఒక స్పూన్ మెంతులు( Fenugreek ) తప్పకుండా తీసుకోవాలి.గసగసాలు, జీలకర్ర, ధనియాలు, ఇంగువ, వాము వంటి ఆహారాలను రెగ్యులర్ డైట్ లో ఉండేలా చూసుకోవాలి.

Telugu Delivery, Tips, Latest, Recovery Foods-Telugu Health

ఈ ఆహారాలన్నీ మహిళల్లో పాల ఉత్పత్తిని పెంచడ‌మే కాదు రక్తస్రావాన్ని తగ్గించడానికి ఉపయోగపడతాయి.అదే సమయంలో నొప్పుల నుండి విముక్తి పొందడానికి మరియు గర్భాశయం కుంచించుకు పోవడానికి అద్భుతంగా హెల్ప్ చేస్తాయి.కాబట్టి ప్రసవం అనంతరం ఈ ఆహారాలను అస్సలు మిస్ అవ్వకండి.అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే.ప్రసవం అనంతరం ఫాస్ట్ ఫుడ్స్( Fast Foods ), జంక్ ఫుడ్స్ కూల్ డ్రింక్స్, టీ, కాఫీ, చేపలు వంటి ఫుడ్స్ ను పూర్తిగా అవాయిడ్ చేయాలి.ఎందుకంటే ఇవి తల్లితో పాటు తల్లిపాలు తాగే బిడ్డ ఆరోగ్యాన్ని సైతం పాడుచేస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube