పసికూనపై చెలరేగిన పాక్..తోలి మ్యాచ్ విజయంతో శుభారంభం..!

ఆసియా కప్ కు( Asia Cup ) తొలిసారి అర్హత సాధించిన నేపాల్ జట్టు,( Nepal ) టోర్నీ ఆతిథ్య పాకిస్తాన్( Pakistan ) చేతిలో ఘోరంగా ఓడిపోయింది.ఈ మ్యాచ్ ఆరంభం నుండి కనీస పోటీయే లేకుండా పాకిస్తాన్ అద్భుత ఆటను ప్రదర్శించి ఊహించినట్టే ఆసియా కప్ లో ఘనంగా బోణి కొట్టింది.

 Pakistan Wins On Nepal Asia Cup 2023 1st Odi Details, Pakistan , Nepal, Asia Cup-TeluguStop.com

పాకిస్తాన్ జట్టు బ్యాటర్లైన బాబర్ అజాం, ఇఫ్తికార్ సెంచరీలతో చెలిరేగి పరుగుల వరద పారించారు.నేపాల్ జట్టు అటు బౌలింగ్ లోను.

ఇటు బ్యాటింగ్ కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది.

ఆసియా కప్ ఆరంభ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ ఏకంగా 238 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి నేపాల్ ను చిత్తుగా ఓడించింది.

పాకిస్తాన్ బ్యాటర్లైన బాబార్ అజాం ( Babar Azam )151 పరుగులు, ఇఫ్తికార్ అహ్మద్( Iftikhar Ahmed ) 109 (నాట్ అవుట్) పరుగులతో విధ్వంసక బ్యాటింగ్ చేయడంతో పాకిస్తాన్ జట్టు ఆరు వికెట్ల నష్టానికి 342 పరుగులు చేసింది.

అనంతరం లక్ష్య చేధనకు దిగిన నేపాల్ జట్టు ఆరంభం నుండే పేలవ ఆటను ప్రదర్శించడం ప్రారంభించింది.పాకిస్తాన్ బౌలర్లైన షాబాద్ ఖాన్( Shabad Khan ) 27 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు.షహీన్ షా ఆఫ్రిది( Shaheensha Afridi ) 27 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు.

హారిస్ రౌఫ్ 16 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు, మొహమ్మద్ నవాజ్, నసీం షా రో ఒక వికెట్ తీసుకున్నారు.

నేపాల్ జట్టు బ్యాటర్లైన సొంపల్ కమి 28 పరుగులు, ఆరిఫ్ షేక్ 26 పరుగులు చేశారు.మిగిలిన బ్యాటర్లు పేలవ ఆట ప్రదర్శనను చేశారు.దీంతో పాకిస్తాన్ జట్టు 23.4 ఓవర్లలో 10 వికెట్లను కోల్పోయి 14 పరుగులు చేసి 238 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube