Tiger Nageswara Rao : రవితేజ మూవీకి దిమ్మతిరిగే షాక్.. ఆ పిటిషన్ తో టైగర్ నాగేశ్వరరావు రిలీజ్ కు ఇబ్బందేనా?

టాలీవుడ్ హీరో మాస్ మహారాజా రవితేజ( Hero Ravi Teja ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.రవితేజ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

 Shocking News To Raviteja Fans Petition Filed To Hold Tiger Nageswara Rao Movie-TeluguStop.com

సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకు దూసుకుపోతున్నారు.అయితే క్రాక్ సినిమా( Krack Movie ) తర్వాత పలు సినిమాలలో నటించినప్పటికీ సినిమాలు పెద్దగా సక్సెస్ ను సాధించలేకపోతున్నాయి.

ఇది ఇలా ఉంటే రవితేజ తాజాగా నటిస్తున్న చిత్రం టైగర్ నాగేశ్వరరావు.

Telugu Nageswara Rao, Raviteja, Tigernageswara, Tollywood-Movie

త్వరలోనే ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.ఒకప్పుడు దేశాన్ని వణికించిన స్టూవర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ( Tiger Nageswara Rao Story ) ఆధారంగా తెరకెక్కుతోం ది టైగర్ నాగేశ్వరరావు.రవితేజ టైటిల్ రోల్ చేస్తున్నారు.

దర్శకుడు వంశీ తెరకెక్కిస్తున్నారు.టైగర్ నాగేశ్వరరావు చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 20న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

అయితే ఈ చిత్ర విడుదలకు బ్రేక్ పడే సూచనలు కనిపిస్తున్నాయి.టైగర్ నాగేశ్వరరావు చిత్ర విడుదల నిలిపివేయాలంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

పిటిషనర్ తరపు న్యాయవాది పృథ్వి ఈ మేరకు వాదనలు వినిపించారు.

Telugu Nageswara Rao, Raviteja, Tigernageswara, Tollywood-Movie

కేసును విచారణకు స్వీకరించిన హైకోర్టు( AP High Court ) చిత్ర నిర్మాతతో పాటు పిటిషన్ లో పేర్కొన్న ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది.దీంతో రవితేజ ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు.

టైగర్ నాగేశ్వరరావు మూవీలో రవితేజకు జంటగా నుపుర్ సనన్ నటిస్తుంది.నటి రేణూ దేశాయ్( Renu Desai ) ఈ చిత్రంతో కమ్ బ్యాక్ ఇస్తున్నారు.

ఆమె కీలక రోల్ లో నటించారు.మురళీ శర్మ, అనుపమ్ ఖేర్ వంటి టాలెంటెడ్ యాక్టర్స్ భాగమయ్యారు.

అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.అయితే ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న అభిమానులకు ఊహించని విధంగా నిరాశ ఎదురయింది.

మరి ఆ అవాంతరాలన్నింటినీ దాటుకొని అనుకున్న సమయానికి మూవీని విడుదల చేస్తారా లేక ఇంకా ఆలస్యంగా విడుదల చేస్తారా అన్నది చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube