అభిమానం అంటే ఇదే... చేతులు లేకపోయినా అల్లు అర్జున్ కోసం చేసిన పనికి ఫిదా అవ్వాల్సిందే!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun ) పుష్ప ( Pushpa ) సినిమాలోని తన నటనకు గాను జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకోవడంతో ఎంతో మంది అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ ఆయనకు సోషల్ మీడియా వేదికగా విభిన్న రీతిలో శుభాకాంక్షలు తెలియజేస్తున్న సంగతి తెలిసిందే.ఇలా గత మూడు రోజులుగా అల్లు అర్జున్ పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంది.

 Even If You Dont Have Hands You Have To Feel Sorry For What Did For Allu Arjun,-TeluguStop.com

ఈ విధంగా అల్లు అర్జున్ పుష్ప సినిమాలో గంధపు చెక్కల స్మగ్లర్ గా ఎంతో అద్భుతంగా నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

ఇలా ఈ సినిమాలో తన నటనకు గాను జాతీయస్థాయిలో అవార్డు రావడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలోనే అల్లు అర్జున్ కు శుభాకాంక్షలు తెలియజేయడం కోసం ఓ దివ్యంగురాలు చేసిన పనికి అల్లు అర్జున్ అభిమానులు ఫిదా అవుతున్నారు.శ్రీకాకుళంకు( Srikakulam ) చెందిన కొవ్వాడ స్వప్నికా( Kovvada swapnika ) రోడ్డు ప్రమాదంలో రెండు చేతులను కోల్పోయారు.

ఇలా రెండు చేతులు లేకపోయినా ఈమె మాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా తన పనులను చేస్తూ ముందుకు అడుగులు వేస్తున్నారు అయితే తనకు బొమ్మల గీయడం అంటే ఎంతో ఇష్టం రెండు చేతులు లేకపోవడంతో నిరుత్సాహపడకుండా నోటితో బొమ్మలు గీయడం నేర్చుకున్నారు.

ఈ విధంగా చేతులు లేకపోయినా తన అభిమాన హీరో అల్లు అర్జున్ కు జాతీయస్థాయిలో అవార్డు రావడంతో ఈమె నోటితోనే పుష్ప సినిమాలో అల్లు అర్జున్ లుక్ ఎంతో అద్భుతంగా గీసి తన అభిమానాన్ని చాటుకున్నారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి.ఈ ఫోటోలు చూసినటువంటి అభిమానులు అభిమానం అంటే ఇదే కదా చేతులు లేకపోయినా హీరో పై ఉన్న అభిమానాన్ని ఇలా వినూత్న రీతిలో చూపించడంతో ఈమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

అయితే ఈమె ఇదివరకే చిరంజీవి పవన్ కళ్యాణ్ వంటి హీరోల ఫోటోలు ఇలా గీసి వారి ప్రశంసలు అందుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube