ఢిల్లీలో సెప్టెంబర్ 8, 9 మరియు 10 వ తేదీల్లో జీ-20 సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే.అయితే ఈ సమావేశాలకు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ గైర్హాజరు అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ ను చైనాలో అంతర్భాగంగా చూపిస్తూ విడుదల చేసిన మ్యాప్ పై వివాదం చెలరేగిన విషయం తెలిసిందే.అరుణాచల్ ప్రదేశ్ ను, అక్సాయ్ చిన్ ను తమ దేశంలో భాగంగా చైనా చూపించుకుంది.
ఈ క్రమంలో మ్యాప్ వివాదం తరువాత జిన్ పింగ్ వెనక్కి తగ్గారని తెలుస్తోంది.కాగా జీ20 సదస్సుకు జిన్ పింగ్ హాజరు అవుతారని గతంలో చైనా ప్రకటించింది.
అయితే తాజాగా మ్యాప్ వివాదం నేపథ్యంలో జిన్ పింగ్ ఢిల్లీకి రావడంపై పునరాలోచన చేస్తున్నారని తెలుస్తోంది.మరోవైపు జిన్ పింగ్ ఢిల్లీకి రావడంపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది.