మీ పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు కచ్చితంగా ఇవ్వాల్సిన ఆహారాలు ఇవే!

సాధారణంగా కొందరి పిల్లల ఎదుగుదల అనేది సరిగ్గా ఉండదు.వయసు పెరుగుతున్నా అందుకు తగ్గ బరువు, ఎత్తు పెరగరు.

పిల్లల్లో చురుకుదనం కూడా పెద్దగా కనిపించదు.దాంతో తల్లిదండ్రులు తెగ హైరానా పడిపోతుంటారు.

వాస్తవానికి పిల్లల ఎదుగుదలలో ఆహారం అనేది ముఖ్యపాత్రను పోషిస్తుంది.అందువల్ల తల్లిదండ్రులు పిల్లలకు చాక్లెట్, బిస్కెట్స్, ఐస్ క్రీమ్స్, చిప్స్ వంటివి కాకుండా పోషకాహారమే ఇచ్చేందుకు ఎక్కువగా ప్రయత్నించాలి.

ముఖ్యంగా పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు కచ్చితంగా ఇవ్వాల్సిన కొన్ని ఆహారాలు ఉన్నాయి.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

గుడ్డు.పోషకాలకు పవర్ హౌస్ లాంటిది.

ఏడాది నిండిన దగ్గర నుంచి మీరు మీ పిల్లల గుడ్డు తినిపించవచ్చు.గుడ్లు అయోడిన్, ఐరన్, ప్రోటీన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఎ, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ బి12 అందిస్తాయి.

అధిక-ప్రోటీన్ ఉండే గుడ్డును అల్పాహారంగా తింటే, అవి పిల్లల ఏకాగ్రత మరియు శక్తి స్థాయిలను పెంచడానికి సహాయపడుతుంది.

అలాగే పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు పాలు మరియు పాల ఉత్పత్తులు చక్కగా దోహదపడతాయి.పాలు, పెరుగు, నెయ్యి, చీజ్ వంటి డైరీ ప్రొడక్ట్స్ ను పిల్లల డైట్ లో చేర్చడం వల్ల వారి ఎముకలు, కండరాల అభివృద్ధి అద్భుతంగా సాగుతుంది.పిల్లలకు సీజనల్ గా దొరికే పండ్లు( Fruits ) మరియు కూరగాయలు ఇవ్వాలి.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

సీజనల్ పండ్లు మరియు కూరగాయల్లో విటమిన్స్, మినరల్స్ తో పాటు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ నిండి ఉంటాయి.అందువల్ల అవి పిల్లల ఆరోగ్యాన్ని ఎదుగుదలను మెరుగుపరుస్తాయి.ఇమ్యూనిటీ పవర్ ను రెట్టింపు చేస్తాయి.

Advertisement

పిల్లల చేత నిత్యం బాదంపప్పు, పిస్తా పప్పు, జీడిపప్పు, వాల్ నట్స్, పొద్దు తిరుగుడు గింజలు, గుమ్మడి గింజలు, పుచ్చ గింజలు వంటి నట్స్ అండ్ సీడ్స్ ను తినిపించాలి.వీటిలో ఖనిజాలు, లవణాలు, ఆరోగ్యమైన కొవ్వులు, మాంసకృతులు నిండి ఉంటాయి.అందువల్ల నట్స్ అండ్ సీడ్స్ పిల్లల శారీరక ఎదుగుదలకే కాకుండా మానసిక ఎదుగుదలకు కూడా తోడ్పడతాయి.

ఇక పిల్లలకు బాగా పాలిష్ చేసిన వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ ( Brown rice )ను అలవాటు చేయడం మంచిది.ఓట్స్ మరియు క్వినోవా వంటి తృణధాన్యాలు పిల్లల చేత తినిపించాలి.

నిరంతరం శక్తివంతంగా ఉండడానికి ఇవి సహాయపడతాయి.జీర్ణక్రియను చురుగ్గా పనిచేసేలా చేస్తాయి.

మరియు పిల్లల ఎదుగుదలకు ఉపయోగపడే అనేక పోషకాలను చేకూరుస్తాయి.

తాజా వార్తలు