తెలుగు ప్రేక్షకులందరికీ కూడా విశాలమైన హృదయం ఉంటుంది.ఎందుకు అంటారా సాధారణంగా ప్రేక్షకులు కేవలం తమ భాషకు సంబంధించిన హీరోలను మాత్రమే ఆదరిస్తూ ఉంటారు.
కానీ తెలుగు ప్రేక్షకులు మాత్రం సినిమా బాగుండాలే కానీ హీరో మనవాడా కాదా అన్నది కూడా చూడరు.సూపర్ హిట్ అందించడం చేస్తూ ఉంటారు.
అయితే గత కొంత కాలం నుంచి తమిళ కన్నడ సినిమాలకి బాగా కలిసి వస్తుంది.తమ సినిమా తెలుగులో డబ్ చేసి ఏకంగా టాలీవుడ్ హీరోలకు పోటీ ఇచ్చే రేంజ్ సంపాదించారు తమిళ హీరోలు.

కానీ ఇప్పుడు మాత్రం తమిళ హీరోలకు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి అని తెలుస్తుంది.ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం.విశాల్ హీరోగా యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన సామాన్యుడు ఫిబ్రవరి 4న విడుదల అయింది.ఈ సినిమా విడుదలైనట్లు కూడా తెలుగు ప్రేక్షకులు చాలా మందికి తెలియదు అంటే ఎంత డిజాస్టరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఇక ఫిబ్రవరి 24న భారీ అంచనాల మధ్య విడుదలైన అజిత్ చిత్రం మూవీ వాలిమై ప్రేక్షకులను ఓ మోస్తరుగా మాత్రమే ఆకట్టుకోగలిగింది.కానీ చివరికి నష్టాలు తప్పలేదు.

దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కిన హే సినామిక మార్చి 3వ తేదీన విడుదలైంది.ఈ సినిమా ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయింది కూడా తెలుగు ప్రేక్షకులకు తెలియదు.అంతలా బొక్క బోర్లా పడిపోయింది.బయోపిక్ లను పక్కనపెట్టి కమర్షియల్గా ఈటి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సూర్య.మార్చి 10వ తేదీన విడుదలైన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను మాత్రం అలరించలేకపోయింది.ఈ సినిమాకు నష్టాలు తప్పలేదు.
ఇది మాత్రమే కాకుండా మార్చి 17న పునీత్ రాజ్కుమార్ నటించిన జెమ్స్, ఏప్రిల్ 13న ఇళయదళపతి విజయ్ నటించిన బీస్ట్, ఏప్రిల్ 28న విజయ్ సేతుపతి నయనతార సమంత నటించిన కేఆర్ కే విడుదల అయి ఫ్లాప్ లుగానే మిగిలిపోయాయి.కానీ కే జి ఎఫ్ చాప్టర్ 2, శివకార్తికేయ డాన్ సినిమాలు మాత్రం టాలీవుడ్ లో హిట్ అయిన డబ్ సినిమాలుగా నిలిచాయి అని చెప్పాలి.