Astrology : కలలో ధనం బంగారం కనిపిస్తే మంచిదో కాదో తెలుసా..

చాలామంది ప్రజలు నిద్రపోయేటప్పుడు వారికి చాలా రకాల కలలు వస్తూ ఉంటాయి.ఆ కలలో అలాంటి వారిలో కొంతమందికి ఏదో చెడు జరుగుతున్నట్లు కలలు వస్తే, మరి కొంతమందికి ఏదో మంచి జరుగుతున్నట్లు కలలు వస్తూ ఉంటాయి.

 If You See Money And Gold In A Dream, Do You Know Whether It Is Good Or Not , Go-TeluguStop.com

ఇలాంటి కలల ప్రపంచం ఎంతో శక్తివంతమైనది.ఇలాంటివన్నీ మానసిక ఆందోళన నుంచి దూరం చేసి మనసులో ఉన్న కొన్ని భయాలను తొలగించేందుకు కూడా ఇవి ఉపయోగపడతాయని కూడా మరి కొంతమంది చెబుతున్నారు.

ప్రతి మనిషికి కొన్ని వేరువేరు కలలు వస్తూ ఉంటాయి.కొంతమంది కలలు కన్న తర్వాత సంతోషంగా ఉంటే ఇంకొంతమంది ఎంతో భయపడుతూ ఉంటారు.నిద్రలో మనస్సు ఎక్కడెక్కడ తిరుగుతుందో అదే మనకు కలగా కనిపిస్తుంది అని కొంతమంది చెబుతూ ఉంటారు.అందుకే మన నిజజీవితంలో సాధ్యం కానీ విషయాలు కొన్ని మన కలలలో జరుగుతూ ఉంటాయి.

Telugu Astrology, Gold Dream, Vastu-Latest News - Telugu

కొంతమందికి పైనుండి పడిపోతున్నట్లు, వేగంగా పరిగెత్తుతున్నట్లు, నాణాలు దొరకడం లాంటి కొన్ని కలలు వస్తూ ఉంటాయి.ఇంకా చెప్పాలంటే కలలలో డబ్బు బంగారు నాణేలు కనిపిస్తే మంచిదో కాదో ఇప్పుడు తెలుసుకుందాం.మనం ఎక్కువగా కలలో డబ్బుకు సంబంధించిన నాణేలు, నోట్లు చూసినట్లయితే దీని వల్ల రాబోయే రోజులలో ఖర్చులు, లాభాలు వచ్చే అవకాశం ఉంది.ఈ కలలో ఎవరైనా ఈ నాణేలను ఇస్తే రాబోయే కాలంలో ఖచ్చితంగా మీరు కొంత లాభం పొందే అవకాశం ఉంది.

మీరు ఎవరికైనా ఈ నాణేలను ఇవ్వడం కలలో కనిపిస్తే రాబోయే రోజులలో ధన నష్టం జరిగే అవకాశం కూడా ఉంది.కలలో బంగారు నాణేలు కనిపిస్తే ఏదైనా పని చేయాలా వద్దా అనే నిర్ణయించుకోలేని సమయంలో ఇలాంటి కలలు వచ్చే అవకాశం ఉంది.

కలలో వెండి నాణాలు కనిపిస్తే ఏదైనా విషయంలో గందరగోళం ఉన్నట్లయితే అలా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube