నేషన్స్ ప్రైడ్ అవార్డు అందుకున్న రియల్ హీరో సోను సూద్!

సినిమా ఇండస్ట్రీలో విలన్ గా అందరిని భయభ్రాంతులకు గురిచేసిన విలక్షణ నటుడు సోనూసూద్ నిజ జీవితంలో హీరోగా ఎంతోమందికి కరోనా సమయంలో సహాయ సహకారాలను అందించడమే కాకుండా సోనుసూద్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇప్పటికీ ఎంతోమందికి విద్య వైద్య రంగాలలో సహాయ సహకారాలు చేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.ఈ విధంగా కష్టాలలో ఉన్నవారికి నేను ఉన్న అంటూ భరోసా కల్పిస్తూ ఎన్నో సేవలు చేస్తున్నటువంటి సోను సూద్ కి ఎంతో ప్రతిష్టాత్మకమైన అవార్డు వరించింది.

 Real Hero Sonu Sood Who Received The Nation Pride Award , Sonu Sood , Bollywood-TeluguStop.com

ఈ విధంగా సోనూ సూద్ తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేస్తున్నటువంటి సేవలకు సరైన ప్రతిఫలం లభించింది.ఈయన చేస్తున్న సేవలకు గాను ఆదివారం రాత్రి ముంబైలోని తాజ్ శాంతాక్రూజ్‌లో సొసైటీ అచీవర్స్ అవార్డ్స్‌లో ‘నేషన్స్ ప్రైడ్’గా సోనూసూద్ ను సత్కరించారు.

చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు సినీ సెలెబ్రెటీల సమక్షంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి సమక్షంలో సోను సూద్ ఈ అవార్డును అందుకున్నారు.

Telugu Bollywood, Award, Sonu Sood-Movie

ఈ కార్యక్రమంలో సోను సూద్ ను సత్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ… ఎంతో ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడం కోసం అవసరమైన సాధనాలతో వెనుకబడిన వారిజీవితాలను మార్చడమే తన లక్ష్యమని ఇలా తన లక్ష్యం కోసం తన స్నేహితులు సహాయం ద్వారా సోను సూదు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేసే ప్రయత్నాలకు సరైన గుర్తింపు లభించింది అంటూ ఈ సందర్భంగా ఈయన తనకు దక్కిన అరుదైన గౌరవం గురించి ప్రస్తావిస్తూ సంతోషం వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube