Face Wrinkles: కేవలం ఈ 3 పదార్థాలు ముడతలను మాయం చేసి చర్మాన్ని యవ్వనం గా మారుస్తాయి!

సాధారణంగా కొందరు చిన్న వయసులోనే ముడతల సమస్యను ఫేస్ చేస్తుంటారు.ఒత్తిడి, నిద్రను నిర్లక్ష్యం చేయడం, ఆహారపు అలవాట్లు, పలు రకాల మందుల వాడకం, మద్యపానం, ధూమపానం ఇందుకు ప్రధాన కారణాలుగా మారుతుంటాయి.

 These Three Ingredients Reduce Wrinkles Naturally Details! Three Ingredients, Wr-TeluguStop.com

అయితే కారణం ఏదైనా చర్మంపై ముడతలు ఏర్ప‌డ‌టం వల్ల ముసలి వారిగా కనిపిస్తుంటారు.ఈ క్రమంలోనే మడతలను వదిలించుకోవడం కోసం చేయాల్సిన ప్రయత్నాలన్ని చేస్తుంటారు.

అయితే ఇప్పుడు చెప్ప‌బోయే మూడు పదార్థాలు ముడ‌త‌ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా మాయం చేయడమే కాదు చ‌ర్మాన్ని యవ్వనంగా మరియు కాంతివంతంగా సైతం మారుస్తాయి.మరి ఇంతకీ ఆ మూడు పదార్థాలు ఏంటి.? వాటిని ఎలా ఉపయోగించాలి.? వంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా రెండు నిమ్మ పండ్ల‌ను తీసుకుని వాటర్ లో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఈ ముక్కలను మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి పల్చటి వాస్త్రం సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

Telugu Tips, Face Wrinkles, Honey, Latest, Lemon, Olive Oil, Remedy, Skin Care,

ఇప్పుడు ఈ నిమ్మ ర‌సంలో మూడు టేబుల్ స్పూన్లు ఆలివ్ ఆయిల్, మూడు టేబుల్ స్పూన్లు తేనె వేసుకుని అన్ని కలిసేంత వరకు బాగా మిక్స్ చేయాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక బాక్స్ లో నింపుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.

నైట్ నిద్రించే ముందు ముఖానికి, మెడకు త‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని అప్లై చేసుకుని సున్నితంగా పది నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.ఈ విధంగా ప్రతిరోజు చేస్తే లెమన్ జ్యూస్, ఆలివ్ ఆయిల్ మరియు తేనెలో ఉండే ప్రత్యేక సుగుణాలు ముడ‌త‌ల‌ను క్రమంగా దూరం చేసి చర్మాన్ని యవ్వనంగా మరియు కాంతివంతంగా మారుస్తాయి.

అలాగే చర్మంపై ఏమైనా మొండి మ‌చ్చలు ఉన్న తొలగిస్తాయి.సాగిన చర్మాన్ని సైతం టైట్ గా మారుస్తాయి.కాబట్టి ముడతలు సమస్యతో బాధపడుతున్న వారు తప్పకుండా పైన చెప్పిన రెమెడీ ని ప్రయత్నించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube