2023వ సంవత్సరంలో ధన త్రయోదశి ఎప్పుడు.. ఆ రోజు బంగారం కొనుగోలు చేయాలా..?

హిందూ సంప్రదాయం ప్రకారం ప్రతి పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది.దసరా నవరాత్రి ఉత్సవాలు( Dussehra Navratri celebrations ) పూర్తయిన తర్వాత ప్రజలు దీపావళి వేడుకలకు సిద్ధమవుతున్నారు.

 When Is Dhana Trayodashi In The Year 2023.. Should You Buy Gold On That Day ,-TeluguStop.com

ఈ మధ్యలో ధన త్రయోదశి ప్రత్యేకంగా నిలుస్తుంది.ఆశ్వయుజ మాసంలోని కృష్ణపక్షంలో బహుళ త్రైయోదశి రోజు ధన్ త్రయోదశిని జరుపుకుంటారు.

ధన్వంతరి జయంతిగా భావించే ఈ రోజున బంగారం, వెండి, ఇతడి, రాగి వంటి వస్తువులను కొనుగోలు చేస్తారు.కొందరు పండితులు చెబుతున్న దాని ప్రకారం ధన త్రయోదశి 2023 వ సంవత్సరంలో ఎప్పుడు వస్తుంది.

ఆ రోజున ఎలాంటి పూజలు నిర్వహిస్తారు అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Devotional, Dhana Triodasi, Diwali, Goddess Lakshmi, Hindu, Kshatriya Cla

పురాణం గ్రంధాల ప్రకారం భీమా అనే రాజుకు ఒక కుమారుడు ఉండేవాడు.వీరిది క్షత్రియ వంశం కాబట్టి విలువిద్యాలన్నీ అతనికి నేర్పిస్తాడు.అయితే రాకుమారుడికి వివాహమైన నాలుగో రోజే మరణిస్తాడు అని కొందరు చెబుతారు.

అయినా ఒక రాజ వంశానికి చెందిన యువతీ రాకుమారుడిని పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తుంది.అయితే తన భర్తను కాపాడుకోవడానికి తన వద్ద ఉన్న అభరణాలన్నీ రాశులుగా పోసి వాటికి దీపాలను వెలిగించి తన ఆరాధ్య దేవత లక్ష్మీ దేవిని ( Goddess Lakshmi )పూజిస్తుంది.

ఇంతలో రాకుమారుడు ప్రాణాలను తీసుకోవడానికి యమధర్మరాజు( Yamadharmaraja ) పాము రూపంలో వస్తాడు.కానీ అక్కడున్న దీప కాంతులకు పాము చూపు మందగిస్తుంది.ఇదే సమయంలో రాకుమారి లక్ష్మీదేవిని తలుస్తూ పాటలు పాడుతుంది.

Telugu Devotional, Dhana Triodasi, Diwali, Goddess Lakshmi, Hindu, Kshatriya Cla

ఆ పాటలకు మైమరిచిపోయిన యమధర్మరాజు రాకుమారుడి ప్రాణాలను తీసుకోవాలని విషయం మర్చిపోతాడు.దీంతో యమ ఘడియలు దాటిపోయి తెల్లారుతుంది.ఆ తర్వాత ఖాళీ చేతులతో ఇంటికి వెళ్తాడు.

అప్పటి నుంచి యముడికి ఈ రోజున దీపం వెలిగిస్తారు.అలాగే ధన త్రయోదశి రోజు ధన్వంతరిని పూజిస్తారు.

ధన త్రయోదశి రోజు లక్ష్మి అమ్మవారిని దర్శించి ప్రత్యేకంగా పూజలు చేయడం ద్వారా అనుగ్రహం పొందుతారని కొందరు పండితులు చెబుతున్నారు.ఈ రోజు బంగారు కొనుగోలు చేయడం ద్వారా లక్ష్మీదేవిని ఇంటికి తెచ్చుకున్నట్లు ప్రజలు భావిస్తారు.

ఇంకా చెప్పాలంటే 2023వ సంవత్సరంలో నవంబర్ 10వ తేదీన ధన త్రయోదశిని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ రోజున మధ్యాహ్నం 12:35 నిమిషములకు మొదలై నవంబర్ 11వ తేదీన మధ్యాహ్నం ఒకటి 57 నిమిషముల వరకు ఉంటుంది.అలాగే లక్ష్మీదేవి( Goddess Lakshmi )కి ఇష్టమైన శుక్రవారం రోజునే ధన త్రయోదశి వస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube