సనాతన ధర్మంలో సర్ప పూజకు గల ప్రాముఖ్యత ఏమిటంటే..?

ముఖ్యంగా చెప్పాలంటే హైందవ సంస్కృతిలో సర్ప పూజ పూర్వం రోజుల నుంచి వస్తున్న ఆచారం అని పండితులు చెబుతున్నారు.దేవా, రాక్షస, యక్ష, గంధర్వ, నాగ, పితృ, మనుష గుణాలను సప్త గుణాలు అని అంటారు.

 What Is The Importance Of Sarpa Puja In Sanatana Dharma , Sarpa Dosha Nivarana-TeluguStop.com

గుణాలలో నాగులకు మనుషులకు అవినాభావ సంబంధం ఉందని పురాణాలలో ఉంది.ఇంకా చెప్పాలంటే నాగులు రజోగుణం అధికంగా కలిగి ఉంటాయి.

ఇవి ఆగ్రహంతో పాటు ఉపకారం చేసే తత్వాన్ని కూడా కలిగి ఉంటాయి.ఈ రెండు గుణాలలో నాగులు మనల్ని పోలి ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి.

సర్పజాతికి ఎనిమిది మంది మూలపురుషులు ఉన్నారని పురాణాలలో ఉంది.వారిలో అనంతుడు, వాసుకి, తక్షకుడు, శంకపాలకుడు, ధనుంజయుడు, కర్కోటకుడు, మహాపద్ముడు, కుశికుడు అని చెబుతున్నారు.

Telugu Devotional, Goddess Parvati, Lord Shiva, Lord Vishnu, Nagendra, Santana D

అనంతుడు, వాసుకి సత్వగుణ ప్రధానులు, తక్షక, కర్కోటకులు తమోగుణ ప్రధానులు అని పండితులు( Scholars ) చెబుతున్నారు.ముఖ్యంగా చెప్పాలంటే మన సనాతన ధర్మంలో ఆదిశేషుడు, నాగేంద్రుడు, వాసుకి, తక్షక పేర్లతో సర్పాన్ని దేవతలతో సమానంగా పూజిస్తూ వస్తున్నారు.అంతకంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే పాలసముద్రంలో శ్రీమహావిష్ణువు( Lord Vishnu ) ఆదిశేషుడు తల్పంగా పరమశివునికి వాసుకి ఆభరణంగా, నాగేంద్రుడు గణపతికి యజ్ఞోపవీతంగా మారి తమ జన్మని ధన్యం చేసుకున్నారు.యోగ శాస్త్రాన్ని రచించిన పతాంజలి ఆదిశేషుడు అవతారమే అని పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి.

Telugu Devotional, Goddess Parvati, Lord Shiva, Lord Vishnu, Nagendra, Santana D

నాగ పూజా విశిష్టత గురించి స్వయంగా శంకరుడే పార్వతీదేవికి( Goddess Parvati ) చెప్పినట్లు స్కంద పురాణంలో ఉంది.మహిళలు తమ అభీష్ట సిద్ధి కోసం “పాహిమాం నాగేంద్ర సౌభాగ్యం దేహిమే” అంటూ నాగుల్ని పూజించడం అనాదిగా వస్తున్న ఆచారం అని చెబుతున్నారు.అయితే నాగపూజను వివిధ ప్రాంతాలలో సంవత్సరానికి రెండుసార్లు చేసుకుంటారు.కార్తీక మాసంలో శుద్ధ చవితిని నాగుల చవితిగా, పంచమిని నాగపంచమిగా జరుపుకుంటారు.సర్పాలు కనిపించగానే భయభ్రాంతులకు గురవకుండా ఆ భయం తో సర్పజాతిని నాశనం చేయకుండా భూత దయను పెంచడానికి పూజ్య భావం పాదుకొల్పటానికి ఈ నాగరాధన తోడ్పడుతుందని పండితులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube