సాధారణంగా ఏడాదిలో అమావాస్య పౌర్ణమిలను పురస్కరించుకొని గ్రహణాలు ఏర్పడటం సర్వసాధారణం.ఈ క్రమంలోనే గత పౌర్ణమి నవంబర్ 19 వ తేదీ పౌర్ణమి రోజు చంద్రగ్రహణం ఏర్పడింది.
ఈ క్రమంలోనే రానున్న అమావాస్య రోజు సూర్యగ్రహణం ఏర్పడనుండడంతో ఈ ఏడాది చివరి సూర్య చంద్ర గ్రహణాలుగా వీటిని చెప్పవచ్చు.ఈ ఏడాదిలో చివరి సూర్యగ్రహణం డిసెంబర్ 4వ తేదీ ఏర్పడనుంది.
సాధారణంగా గ్రహణం ఏర్పడిన తర్వాత గ్రహాలు చలనం వల్ల కొన్ని రాశుల వారికి ఎన్నో ఇబ్బందులు కలగడం జరుగుతుంది.
ఈ క్రమంలోనే డిసెంబర్ 4వ తేదీ ఏర్పడనున్న చివరి సూర్యగ్రహణ ప్రభావం కొన్ని రాశుల వారిపై ఉండబోతోంది.
మేష రాశి, కర్కాటక రాశి, తులారాశి, వృశ్చిక రాశి, మీన రాశి వారిపై సూర్యగ్రహణ ప్రభావం ఉండబోతోంది.కనుక ఈ రాశివారు సూర్యగ్రహణ సమయంలో ఎవరితోనూ వాగ్వాదం చేయకుండా ఉండటం మంచిది అలాగే గ్రహణం రోజు ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఆ రోజు మొత్తం ఎంతో జాగ్రత్తగా వ్యవహరించడం ఎంతో శుభం.
ఇక డిసెంబర్ నాలుగు 2021లో రానున్న సూర్యగ్రహణం చివరి సూర్యగ్రహణం కావడంతో ఈ గ్రహణ ప్రభావం ఏ సమయంలో ఉండబోతోంది అనే విషయానికి వస్తే.డిసెంబర్ 4వ తేదీ మార్గ శీర్ష కృష్ణ పక్ష అమావాస్య కూడా.ఈ సూర్యగ్రహణం ఉదయం 10:59 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 3:7 గంటల వరకు ఉంటుంది.గ్రహణ సమయంలో ప్రతి ఒక్కరు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి.
ఇక ఈ ఏడాదిలో చివరి సూర్యగ్రహణం ఇదే కావడంతో ఈ రాశుల వారు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది.
LATEST NEWS - TELUGU