మిస్ చెన్నై మెమొరీని గుర్తు చేసుకున్న త్రిష

సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటి త్రిష.ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పటికే రెండు దశాబ్దాలు పూర్తి చేసుకొని 40 ఏళ్ళు దాటినా ఈ అందాల భామ ఏమాత్రం వన్నె తగ్గని అందంతో సినిమాలు చేస్తూనే ఉంది.

 Trisha Throwback To The Day That Changed Her Life, Tollywood, Kollywood, South I-TeluguStop.com

కెరియర్ ముగిసిపోయింది అనుకుంటున్న ఈసమయంలో కూడా మంచి కంటెంట్ బేస్ సినిమాలు చేస్తూ తన ముద్ర వేసుకుంటుంది.తాజాగా తమిళంలో విజయ్ సేతుపతితో కలిసి నటించిన 96 ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.

సౌత్ లో సుమారు అందరు స్టార్ హీరోలతో జత కట్టిన ఈ భామ తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో ఏకకాలంలో సినిమాలు చేస్తూ నెంబర్ వన్ స్థాయికి ఎదిగింది.ప్రస్తుతం ఒకప్పటిలా సినిమాలు చేయకున్నా సెలక్టివ్ గా తన మనసుకి నచ్చే కథలు ఎంపిక చేసుకుంటూ సినిమాలు చేసుకుంటుంది.

ఇదిలా ఉంటే తాజాగా ఈ భామ తన కెరియర్ ఆరంభానికి సంబంధించిన మధుర స్మృతులని ట్విట్టర్ లో పంచుకుంది.సినిమాల్లోకి రాకముందు సరిగ్గా 21 ఏళ్ల క్రితం ఇదే రోజున త్రిష ‘మిస్ చెన్నై’ టైటిల్ గెలుచుకుంది.

ఈ సందర్భంగా మిస్ చెన్నై కిరీటాన్ని ధరించిన ఫొటోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది.అక్టోబర్ 30 తన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది అని ఇదే తేదీన మిస్ చెన్నై 1999 సొంతం చేసుకున్న అని కామెంట్ చేసింది.

మొత్తానికి త్రిష ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలకి పైగా పూర్తి చేసుకోవడంతో ఆమెకి అభిమానులు విషెస్ చెబుతున్నారు.మరిన్ని అద్బుతమైన సినిమాలలో త్రిషని చూడాలని అనుకుంటున్నట్లు నెటిజన్లు కామెంట్స్ పెట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube