రియా తీవ్ర స్థాయిలో నేరం చేసింది అంటున్న ఎన్సీబీ అధికారులు

సుశాంత్ డెత్ మిస్టరీని చేధించే ప్రయత్నం చేస్తున్న సీబీఐ అధికారులకి డ్రగ్స్ లింకులు వెలుగులోకి తీసుకొచ్చి డ్రగ్స్ వ్యవహారంపై నార్కోటిక్ కంట్రోల్ బోర్డుకి విచారణ బాద్యతలు అప్పగించింది.అప్పటి నుంచి బాలీవుడ్ లో డ్రగ్స్ మాఫియా, కల్చర్ గురించి మరింత లోతుగా విచారణ చేపట్టే క్రమంలో సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి, ఆమె సోదరుడు సోవిక్ ని ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేసి విచారిస్తున్న సంగతి తెలిసిందే.

 Ncb Case Against Rhea Chakraborty In Mumbai High Court, Bollywood, Drugs Probe,-TeluguStop.com

ఈ నేపధ్యంలో ఆమె మీద ఎన్సీబీ అధికారులు సుదీర్ఘంగా చార్జ్ షీటు సిద్దం చేసినట్లు తెలుస్తుంది.ఆమెని అరెస్ట్ చేసిన ఎన్సీబీ అధికారులకి కీలక ఆధారాలు లభించాయని, డ్రగ్స్ సిండికేట్ తో రియా నేరుగా సంబంధాలు కలిగి ఉందని, ఎంతో మంది బాలీవుడ్ సెలబ్రిటీలకి ఆమె డ్రగ్స్ సప్లయర్ గా పని చేసిందని గుర్తించినట్లు తెలుస్తుంది.

ఈ నేపధ్యంలో ముంబై హైకోర్టుకి రియా చక్రవర్తి బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా ఆమెకి బెయిల్ మంజూరు చేయొద్దని ఎన్సీబీ అధికారులు అఫిడవిట్ దాఖలు చేశారు.

డ్రగ్స్ కేస్ సిండికేట్ లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ప్రియురాలు రియా చక్రవర్తిదే కీలక పాత్రని, ఆమె తన సోదరుడు షోవిక్ తో కలిసి ఈ దందాను సాగించినట్టుగా ఆధారాలు ఉన్నాయని కేసును విచారిస్తున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో తన అఫిడవిట్ ను ముంబై హైకోర్టులో దాఖలుచేసింది.

ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే పేరిట ఇది దాఖలైంది.డ్రగ్స్ ట్రాఫికింగ్ కు రియా నిధులను అందించిందని, దీనికి సంబంధించిన ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ వాట్స్ యాప్ చాటింగ్ రూపంలో ఉందని వెల్లడించింది.

రియా మొబైల్, ల్యాప్ టాప్, హార్డ్ డిస్క్ లో మాదకద్రవ్యాల సరఫరాకు సంబంధించిన ఎన్నో ఆధారాలు ఉన్నాయని, కేసు విచారణ జరుగుతున్న దశలో బెయిల్ ను మంజూరు చేస్తే, బయటకు వచ్చి సాక్ష్యాలను నాశనం చేసే అవకాశాలు ఉన్నాయని, బెయిల్ ఇవ్వరాదని కోరింది.రియా చక్రవర్తి తరచుగా డ్రగ్స్ సరఫరాదారులతో మాట్లాడుతూ, వారితో సంబంధాలు కొనసాగించారని కూడా ఎన్సీబీ తన అఫిడవిట్ లో స్పష్టం చేసింది.

ఎన్సీబీ అధికారులు అందించిన అఫిడవిట్ ఆధారంగా ఈ సారి కూడా ఆమెకి బెయిల్ మంజూరు అయ్యే అవకాశం లేదని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube