పోలీస్ ఆఫీసర్ గా ప్రియమణి... సైకో బయోపిక్ కోసం

కర్ణాటకలో సైకో మోహన్ అనే పేరు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అమాయక ఆడపిల్లలని లైంగికంగా వాడుకొని తరువాత వారికి సైనైడ్ ఇచ్చి హత్యలు చేసిన పీఈటీ టీచర్ మోహన్ ఉదంతం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.

 Rajesh Touchriver To Make A Film On The Case Of Cyanide Mohan, Tollywood, Pan In-TeluguStop.com

ఇతని భారిన పదుల సంఖ్యలో అమ్మాయిలు పడి ప్రాణాలు పోగొట్టుకున్నారు.అయితే ఆడపిల్లలు చనిపోతున్న ఇతను సైనైడ్ ఇచ్చి చంపుతున్నాడు అనే విషయం చాలా కాలం పాటు పోలీసులు సైతం గుర్తించలేకపోయారు.

ఈ క్రమంలో వాడి చేతిలో 20 మంది అమ్మాయిలు చనిపోయారు.వీడి వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రపంచంలో ఎంతో మంది సైకో కిల్లర్ ల జాబితాలో వీడి పేరు చేరిపోయింది.

అతనికి 6 మరణశిక్షలు, 14 జీవిత ఖైదులను విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది.

ఈ కేసు ఆధారంగా నా బంగారు తల్లి సినిమాతో జాతీయ స్థాయి గుర్తింపు పొందిన దర్శకుడు రాజేశ్‌ టచ్‌రివర్‌ సైనైడ్‌ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

దక్షిణాది భాషలు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం సహా హిందీలో పాన్‌ ఇండియా మూవీగా ఈ సినిమాని తెరక్కిస్తున్నారు.ప్రదీప్‌ నారాయణన్‌ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో సైనైడ్ మోహన్ కేసుని ఇన్వెస్టిగేట్ చేసే పోలీస్ ఆఫీసర్ పాత్రలో‌ హీరోయిన్ ప్రియమణి కనిపించబోతుంది.హిందీలో ఆ పాత్రను యశ్‌పాల్‌ శర్మ పోషిస్తారని దర్శకుడు తెలిపారు.

జనవరి నుంచి చిత్రీకరణ ప్రారంభిస్తామని నిర్మాత ప్రదీప్‌ నారాయణన్‌ చెప్పారు.తనికెళ్ల భరణి, సమీర్‌, రోహిణి, చిత్రంజన్‌ గిరి తదితరులు ఈ సినిమాలో నటించనున్నారు.

ఇదిలా ఉంటే సైకో మోహన్ పాత్రలో ఎవరు కనిపించబోతున్నారు అనే విషయం తెలియాల్సి ఉంది.వచ్చే ఏడాది హీరోయిన్ ప్రియమణి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.

  వెంకటేష్ సినిమా నారప్పతో పాటు, విరాటపర్వం సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తుంది.దీంతో పాటు ఇప్పుడు ఏకంగా  పాన్ ఇండియా ప్రాజెక్ట్ఒకే  చేయడం చూస్తుంటే ఆమె సెకండ్  ఇన్నింగ్ లో మంచి జోరు చూపిస్తుందని అర్ధమవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube