దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు చిత్రాలు అంటే చాలు హీరోయిన్స్ కోసమైనా సినిమాలు చూడాల్సిందే అనేంతలా రాఘవేంద్రరావు ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు.
సీనియర్ ఎన్టీఆర్ నుంచి మొదలుకుని జూనియర్ ఎన్టీఆర్ వరకు చాలా మందిని డైరెక్ట్ చేసిన రాఘవేంద్రరావు.చాలా మంది స్టార్ కిడ్స్‌ను వెండితెరకు హీరోలుగా పరిచయం చేశాడు.
ఈ క్రమంలోనే ప్రభాస్‌ను హీరోగా పరిచయం చేస్తూ ఓ సినిమా తీయాలని అప్పట్లో ప్రభాస్ తండ్రి రాఘవేంద్రరావును కోరారు.కానీ, ఆ కారణం వల్ల రాఘవేంద్రరావు ప్రభాస్‌తో సినిమా చేయలేకపోయాడట.
అదేంటంటే.
తెలుగు సినిమా చరిత్రలో దర్శకుడిగా తనకంటూ సెపరేట్ రికగ్నిషన్ తెచ్చుకున్న డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు.కమర్షియల్ సినిమాకు కేరాఫ్‌గా ఉంటూనే భక్తి చిత్రాలు తీస్తూ తనకంటూ ఓ మార్క్ ఏర్పాటు చేసుకున్నాడు.
ఇకపోతే ఆయన ఇంట్రడ్యూస్ చేసిన హీరోలు అందరూ నేడు స్టార్ హీరోలుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు.విక్టరీ వెంకటేశ్, సూపర్ స్టార్ మహేశ్ బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో పాటు బోలెడు మంది హీరోయిన్స్‌ను రాఘవేంద్రరావు తెలుగు సిల్వర్ స్క్రీన్‌కు ఇంట్రడ్యూస్ చేశారు.
దర్శకేంద్రుడి పర్యవేక్షణలో రాజమౌళి డైరెక్షన్‌లో జూనియర్ ఎన్టీఆర్‌ను ఇంట్రడ్యూస్ చేశారు.ఈ సంగతులు పక్కనబెడితే.ప్రభాస్ తండ్రి కె.రాఘవేంద్రరావుకు సన్నిహితులు.ఈ క్రమంలో తన కుమారుడు ప్రభాస్‌ను హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ ఓ సినిమా చేయాలని ప్రభాస్ తండ్రి కోరాడట.రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో సినిమా చేయడానికి ప్రభాస్ కూడా ఆసక్తి చూపారు.
అయితే, తాను అప్పుడు చాలా బిజీగా ఉండటం వల్ల కుదరలేదని, ప్రభాస్‌ను తెలుగు తెరకు పరిచయం చేయలేకపోయానని చెప్పుకొచ్చాడు రాఘేంద్రరావు.దర్శకేంద్రుడికి కుదురకపోవడంతో ప్రభాస్‌ను జయంత్ సి.పరాన్జీ ‘ఈశ్వర్’గా ప్రేక్షకులకు మందుకు తీసుకొచ్చాడు.ఆ సినిమా సూపర్ హిట్ అయింది.
ఇక ప్రభాస్ ‘బాహుబలి’ సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు.ఆయన నటించే ప్రతీ చిత్రం పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ అవుతున్నది.
ఈ క్రమంలోనే రెబల్ స్టార్ ప్రభాస్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగింది.ఆలిండియా వైడ్ ప్రభాస్ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది.
వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రభాస్ నటించిన ‘రాధే శ్యామ్’ ఫిల్మ్ విడుదల అవనుంది.