కలియుగం( Kali Yuga )లో ప్రతి మానవుడికి జీవితంలో కష్ట,సుఖాలు రెండు కలుగుతాయి.ముఖ్యంగా చెప్పాలంటే కష్టాలు కలిగయని కృంగిపోకుండా, సుఖాలు కలిగాయని పొంగిపోకూడదు.
రెండిటిని సమానంగా చూస్తూ భగవంతునీ శక్తిని నమ్మి కష్టములన్నీ ఆయన యొక్క ఆజ్ఞనుసారమే కలుగుతాయని నమ్మాలి.దీనిని గ్రహించి ప్రతి మనిషి ఆధ్యాత్మిక చింతనతో మోక్ష సాధన కోసం భగవత్ తత్వము అలవర్చుకొనుట కోసం జీవితాన్ని కొనసాగించాలని పండితులు( Scholars ) చెబుతున్నారు.
మానవ జీవితంలో ఎదురయ్యేటువంటి కష్టములకు ప్రశ్నలకు సమాధానం సత్యనారాయణ స్వామి వ్రతము( Satyanarayana Swami Vratam)లో దొరుకుతుందని పండితులు చెబుతున్నారు.

అన్నవరం సత్యనారాయణ స్వామి( Annavaram Satyanarayana Swamy ) దర్శనం వల్ల అనుకున్న పనులు కచ్చితంగా నెరవేరుతాయి.జ్యోతిష్య శాస్త్రం( Astrology ) ప్రకారం అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించిన వారికి జాతకంలో ఉన్న కష్టాలు తొలగి సుఖసంతోషాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.శ్రావణమాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించే ముందు భక్తులు అన్నవరం దేవాలయ మహత్యం గురించి కచ్చితంగా తెలుసుకోవాలి.
నూతనంగా వివాహమైన వారు, గృహారంభ, గృహప్రవేశం వంటి నూతన కార్యక్రమాలు ఆచరించిన వారు సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించినట్లయితే వారికి శుభాలు కలుగుతాయని పెద్దవారు చెబుతున్నారు.

అంతేకాకుండా అన్నవరం భారత దేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలలో ఒకటి.ఈ దేవాలయం ద్రావిడ శైలిలో నిర్మించబడి ఉంది.శ్రీ సత్య దేవా స్వామి కీర్తి గొప్పతనాన్ని స్కంద పురాణం( Skanda Purana ) యొక్క రేవాఖండములో వర్ణించారు.
శ్రీ సత్యదేవస్వామి సతీమణి శ్రీ అనంత లక్ష్మ తో ఒకవైపు మరియు శివుడు మరోవైపు కలిగి ఉన్నారు.అన్ని దివ్యక్షేత్రాలవలే వలె అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారు వెలసిన కొండ ను తాకుతూ పంపా నది ప్రవహిస్తూ ఉంది.
అంతేకాకుండా స్వామి నిత్యం భక్తులకు దీవెనలను అందిస్తూ ఉన్నారు.కాబట్టి ఎలాంటి తారతమ్యం లేకుండా విష్ణుభక్తులు, శివ భక్తులు, వేలాది మంది యాత్రికులు స్వామివారిని దర్శించుకుంటున్నారు.
DEVOTIONAL