వైరల్ వీడియో: ఇది నిజమైన పిల్లేనా.. లేక మన బ్రమా..?!

తమ కంపనీ ప్రోడక్ట్స్ ని పబ్లిసిటీ చేసుకోవడానికి కంపనీ వాళ్ళు రక రకాల ప్రయోగాలు చేస్తూ ఉండడం మనం గమనించే ఉంటాము.అయితే జపాన్ రాజధాని టోక్యోలో కూడా ఒక సరికొత్త ఆలోచన చేసారు.

 Is This A Real Cat  Or Our Imagination  Cat, Viral Latest, Viral News, Viral Vid-TeluguStop.com

అది ఏంటంటే.ఒక భారీ బిల్ బోర్డుపై ఒక పెద్ద పిల్లి కూర్చుని ఉంటుంది.

ఉన్నటుండి సడెన్ గా పైకి లేచి తోక ఊపుకుంటూ అటు ఇటు చూస్తూ కనిపించింది.మియావ్ మియావ్ అంటోంది.

ఆ పిల్లి కూడా చూడడానికి బాగా పెద్దగా ఉంటుంది.మనం చూసే పిల్లి మాదిరిగా ఉండదు.

చూడడానికి చాలా బాగుంటుంది.మూడు రకాల రంగులు పిల్లి శరీరం అంతా ఉంటాయి.

అలాగే కూర్చున్న పిల్లి పైకి లేచిన తరువాత మధ్య మధ్యలో cross shinjuku vision అనే అడ్వర్టైజ్మెంట్స్ కూడా కనిపిస్తున్నాయి.

ఆ తరువాత మరి కొన్నిసార్లు పిల్లి మియావ్ అని అరుస్తుంది.

కొంచం సేపు అయ్యాక దానిపై డిజిటల్ పద్దతిలో టైమ్ కూడా డిస్ ప్లే అవుతుంది.అసలు ఇదంతా ఏంటి అనుకుంటున్నారా.? దీన్ని చుసిన వారు అందరు నిజమైన పిల్లే అని అనుకున్నారు.కానీ నిజానికి అది అసలైన పిల్లి కాదు.ఒక 3D యానిమేషన్ పిల్లి.ఏంటి షాక్ అయ్యారా ? కానీ ఇదే నిజం.అది నిజమైన పిల్లి కాదు.కావాలంటే ఈ వీడియో మీరు కూడా చూడండి.

ఇప్పటికే ఈ 3D క్యాట్ కు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి.ఈ పెద్ద పిల్లి దాదాపు 1,664 చదరుపు అడుగులు ఉంటుంది.కర్వడ్ ఎల్ఈడీ స్క్రీన్ తో 4K రెజల్యూషన్ డిస్ ప్లే లో మనకి కనిపిస్తుంది.ఈ బిల్ బోర్డు టోక్యోలోని షింజుకు జిల్లాలో రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో ఒకటి అట.ఈ 3D క్యాట్ కు సంబందించి వీడియోను ఒక ట్విట్టర్ యూజర్స్ వారి సోషల్ అకౌంట్లో పోస్టు చేయగా, పోస్ట్ చేసిన కొద్ది సేపటికే మిలియన్ల వ్యూస్ వచ్చాయి.పిల్లి వీడియోకు క్యాప్షన్ ను జపనీస్ భాషలో పెట్టి పోస్ట్ చేసాడు.

ఏది ఎలా ఉన్న ఈ రియల్ క్యాట్ ను తలపించే 3D క్యాట్ మాత్రం నెటిజన్లను బాగా ఆకర్షిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube