ఈ ఏడాది మహాశివరాత్రి ఎప్పుడు...శివరాత్రి రోజు తప్పకుండా పాటించాల్సిన నియమాలివే!

హిందువులు ఎంతో ఘనంగా జరుపుకునే పండుగలలో మహాశివరాత్రి ఒకటి.ఈ మహా శివరాత్రి రోజు దేశవ్యాప్తంగా పరమేశ్వరుడి ఆలయాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి.

 When Is Mahashivaratri This Year These Are The Rules That Must Be Followed On Sh-TeluguStop.com

ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా మహా శివరాత్రి పండుగను ఈ ఏడాది మార్చి 1వ తేదీ మంగళవారం ఎంతో ఘనంగా జరుపుకోనున్నారు.ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పండుగ ఫాల్గుణ మాసం కృష్ణపక్షం చతుర్దశి రోజు మహా శివరాత్రి పండుగను జరుపుకుంటారు ఈ క్రమంలోని ఈ ఏడాది ఈ పండుగను మార్చి 1వ తేదీ జరుపుకుంటున్నారు.

మన హిందూ పురాణాల ప్రకారం శివరాత్రి పండుగను పార్వతీ పరమేశ్వరుల కల్యాణం జరిగిన దినంగా భావిస్తారు.అందుకే చాలా మంది ఈరోజు ఉపవాసాలతో స్వామివారికి పూజ చేసి అనంతరం జాగరణలు చేస్తూ స్వామివారి కృపకు పాత్రులు అవుతారు.ఇక ఈ ఏడాది ఈ పండుగ చేసుకోవడానికి అనువైన సమయం ఏది అనే విషయానికి వస్తే మార్చి 1 మంగళవారం తెల్లవారుజామున 3.16 గంటలకు ప్రారంభమై చతుర్దశి తిథి మార్చి 2 బుధవారం ఉదయం 10 గంటలకు ముగుస్తుంది.

పవిత్రమైన ఈ పండుగ రోజు స్వామివారికి పండ్లు ప్రసాదాలను నైవేద్యంగా సమర్పిస్తారు అలాగే పెద్ద ఎత్తున ఉపవాస దీక్షలతో పూజ చేస్తారు.ఎంతో పవిత్రమైన ఈ పండుగ రోజు పొరపాటున కూడా మాంసం మద్యం సేవించకూడదు.అలాగే ఉపవాసం ఉన్నవారు పాలు పండ్లు తీసుకుంటూ స్వామివారికి పూజ చేయవచ్చు.ఇక ఉపవాసం ఉన్నవారు స్వామి వారి భజనలు చేస్తూ స్వామివారి సేవలో పాల్గొనాలి.అదేవిధంగా శివరాత్రికి జాగరణ చేసే వారు కందగడ్డ లను తినడం ఎంతో మంచిది.ఇలా శివరాత్రి పండుగ రోజు భక్తిశ్రద్ధలతో ఈ పండుగను జరుపుకుంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube