సుప్రీం కోర్టులో కూడా కొరటాల శివకు షాక్.. ఎనిమిదేళ్ల క్రితం చేసిన తప్పు ఇప్పుడు శాపమైందా?

మహేష్ బాబు , కొరటాల శివ( Mahesh Babu, Koratala Shiva ) కాంబినేషన్ లో తెరకెక్కిన శ్రీమంతుడు సినిమా( Srimanthudu movie ) బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసింది.

ఊరిని దత్తత తీసుకునే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా మహేష్ బాబు అభిమానులకు ఎంతగానో నచ్చేసింది.

అయితే ఈ సినిమా కాపీరైట్ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే.శరత్ చంద్ర( Sarat Chandra ) అనే రైటర్ ఈ సినిమా కథ నాదేనంటూ అప్పట్లో చేసిన హంగామా అంతాఇంతా కాదు.

ఈ కేసు చివరకు సుప్రీం కోర్టుకు చేరగా హైకోర్టు ఆదేశాల ప్రకారం కొరటాల శివ క్రిమినల్ కేసును ఫేస్ చేయాల్సిందేనని ఆదేశాలు వెలువడ్డాయి.నిరంజన్ రెడ్డి ( Niranjan Reddy )ఈ కేసును వాదించగా కోర్టులో కొరటాల శివకు అనుకూలంగా తీర్పు రాకపోవడం గమనార్హం.

కొరటాల శివ ఈ కేసు గురించి రాబోయే రోజుల్లో ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.ఎనిమిదేళ్ల క్రితం చేసిన తప్పు ఇప్పుడు శాపమైందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Advertisement

కొరటాల శివ ప్రస్తుతం దేవర సినిమా పనులతో బిజీగా ఉన్నారు.దేవర సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కాగా కొరటాల శివ తర్వాత ప్రాజెక్ట్ గురించి స్పష్టత లేదు.దేవర విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిస్తే మాత్రమే కొరటాల శివకు కొత్త ఆఫర్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది.

కొరటాల శివ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటుండగా దేవర రిజల్ట్ ఎలా ఉండబోతుందో చూడాల్సి ఉంది.

కొరటాల శివ ఈ సినిమాకు 25 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.కొరటాల శివ ఇతర భాషల్లో సైతం సక్సెస్ సాధించాలని మంచి ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా సత్తా చాటాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.కొరటాల శివ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు