కొరటాల శివ డైరెక్షన్ లో ఎన్టీఆర్ హీరోగా వస్తున్న సినిమా దేవర( Devara )ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తయింది.ఇక ఈ క్రమంలో ఎన్టీఆర్ దేవర సినిమాకు బ్రేక్ ఇచ్చి వార్ 2 సినిమా షూటింగ్ లో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది.
అయితే వార్ 2( War 2 ) సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి దేవర సినిమా బ్యాలెన్స్ మొత్తాన్ని షూట్ చేయాలనే ఆలోచనలో ఎన్టీయార్ ఉన్నట్టుగా తెలుస్తుంది.అయితే ఈ సినిమా అఫీషియల్ రిలీజ్ డేట్ ఇంకా అనౌన్స్ అయినప్పటికీ, ఈ సినిమాను జూన్ చివరి వారంలో గానీ, లేదంటే జూలై మొదటి వారం లో గాని రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
ఇక ఈ సినిమాలో ఇప్పటివరకు జరిగిన మొత్తం చాలా గ్రాండ్ గా షూట్ చేసినట్టుగా తెలుస్తుంది.ఇక ఈ సినిమా కోసం ఇక్కడ రాజీ పడకుండా సినిమాని భారీ బ్లాక్ బస్టర్ దిశ గా ముందుకు తీసుకెళ్లలనే ప్రయత్నంలో భాగంగానే షూటింగ్ కూడా చాలా హై లెవల్లో చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
మరి ఇదిలా ఉంటే ఈ సినిమాతో భారీ హిట్ కొట్టడమే కాకుండా ఎన్టీఆర్( Jr ntr ) తన స్టామినా ఏంటో అనేది మరోసారి పాన్ ఇండియా లెవెల్లో చూపించబోతున్నాడు అంటూ వార్తలు కూడా వస్తున్నాయి.ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ ( Saif Ali Khan )నటిస్తున్నాడు.ఇక వీళ్ళ మధ్య జరిగే ఒక ఫైట్ ఎపిసోడ్ ఈ సినిమాకి హైలైట్ గా నిలవబోతున్నట్టుగా సినిమా యూనిట్ తెలియజేస్తున్నారు.ఒక మొత్తానికైతే ఈ సినిమా ద్వారా ఇటు కొరటాలకు, అటు ఎన్టీఆర్ కు బ్లాక్ బస్టర్ హిట్ దక్కబోతున్నట్టుగా తెలుస్తుంది…ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో పాన్ ఇండియాలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా కొరటాల శివ గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు…
.