పవన్ కళ్యాణ్ కి మద్దతుగా రామ్ చరణ్..!!

ఏపీ ఎన్నికలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.దీంతో పవన్ కళ్యాణ్ ని గెలిపించడం కోసం ఇండస్ట్రీలో చాలామంది ప్రముఖులు పిఠాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.

 Ram Charan Supports Pawan Kalyan Janasena, Pawan Kalyan, Ram Charan, Ap Election-TeluguStop.com

మొన్నటి వరకు జబర్దస్త్ టీం రాంప్రసాద్, సుడిగాలి సుదీర్, గెటప్ శీను.మరి కొంతమంది సీరియల్ యాక్టర్లు జనసేన కోసం ప్రచారం చేయడం జరిగింది.

మెగా హీరోలు వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, సాయిధరమ్ తేజ్ కూడా పిఠాపురంలో పవన్ గెలుపు కోసం.రోడ్ షోలు నిర్వహించడం జరిగింది.

ఈరోజు ఉదయం మెగాస్టార్ చిరంజీవి కూడా తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ని గెలిపించి చట్టసభల్లో కూర్చోబెట్టాలని పిఠాపురం ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

సినిమాల్లోకి బలవంతంగా వచ్చిన కళ్యాణ్ రాజకీయాల్లోకి మాత్రం ఇష్టంగా వచ్చాడని చిరంజీవి ( Chiranjeevi )వెల్లడించారు.పవన్ కళ్యాణ్ తన సొంత సంపాదన కవులు రైతుల కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టాడు.సరిగాద్దుల్లో ప్రాణాలకు తెగించి పోరాడే జవాన్ల కోసం పెద్ద మొత్తం అందించాడు.

మత్స్యకారులకు సాయం చేయడం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనాలకి కావాల్సింది అనిపిస్తుంది.జనమే జయం అని నమ్మే జనసేనని ఏం చేయగలడు చూడాలంటే పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ ను గెలిపించాలి.

మీ సేవకుడిగా సైనికుడిగా అండగా నిలబడతాడు.మీకోసం కలబడి మీ కలలను నిజం చేస్తాడు.

గాజు గ్లాసు గుర్తుపై ఓటేసి పవన్ కళ్యాణ్ ని గెలిపించండి అని చిరంజీవి కోరారు.ఈ వీడియోని రామ్ చరణ్( Ram Charan ) సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది.

ఇదే సమయంలో మీ భవిష్యత్తు కోసం పాటుపడే నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి అని పిలుపునిచ్చారు.అంతేకాకుండా తాను జనసేన పార్టీకి మద్దతిస్తున్నట్లు రామ్ చరణ్ స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube