చేతి నిండా ఫ్లాప్ లు..పడిపోతున్న విజయ్ దేవరకొండ పారితోషకం

విజయ్ దేవరకొండ( Vijay Deverakonda )… క్రేజ్ విషయంలో రోజురోజుకీ అంచనాలు పెంచుకుంటూ వెళుతున్నాడు ఈ హీరో.ఎన్ని సినిమాలు ఫ్లాప్ అవుతున్నా కూడా అతడికి మాత్రం తగ్గడం లేదు.

 Vijay Devarakonda Remuneration Details , Vijay Deverakonda , Vijay Devarakonda-TeluguStop.com

సినిమాలు వేరు అభిమానులు వేరు అని విషయాన్ని విజయ్ దేవరకొండ ను చూస్తే అర్థమవుతుంది.ఇక లైగర్ సినిమా ఫ్యాన్ ఇండియా వ్యాప్తంగా విడుదలై విజయ్ దేవరకొండ ను సూపర్ స్టార్ హీరోగా మార్చేస్తుందని ఎన్నో కలలు కన్నాడు.

కానీ ఆ సినిమా పరాజయం అతని ఆశలను అడియాశలు చేయడంతో పాటు పూరి జగన్నాథ్ కూడా కెరియర్ పరంగా చాలా డౌన్ చూసేలా చేసింది.మొత్తంగా విజయ్ దేవరకొండ ప్యాన్ ఇండియా స్టార్ కాకుండా మళ్లీ సౌత్ ఇండియా కే పరిమితమైయ్యాడు.

Telugu Dil Raju, Liger, Tollywood-Movie

అయితే రీసెంట్ గా దిల్ రాజు నిర్మాణంలో ఫ్యామిలీ స్టార్ సినిమా ( The Family Star )వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే.ఈ సినిమా దారుణంగా పరాజయం పాలవడంతో మరోసారి విజయ్ దేవరకొండ ఆశలన్నీ గల్లంతయ్యాయి.అయితే ఇలా వరుస సినిమాలు ఫెయిల్ అవుతుండడంతో విజయ్ దేవరకొండ పారితోషకం విషయంలో కూడా అనేక మార్పులు వస్తున్నాయి.కరోనాలో ఎన్నో కష్టాలను చూస్తున్న సమయంలో విజయ్ దేవరకొండ కి కొంతమేర అడ్వాన్స్ వచ్చి రెండు సినిమాలకు బుక్ చేసుకున్నాడు దిల్ రాజు( Dil Raju ).ఆ టైంలో రెండు సినిమాలకు గాని 25 కోట్లు ఇస్తానని చెప్పాడట.అయితే మీడియం బడ్జెట్ హీరో అయినప్పటికీ విజయ్ దేవరకొండ కి మంచి రెమ్యునరేషన్ తీసుకునే అవకాశం ఉన్న తన అవకాశం తన అవసరం కొద్దీ తక్కువ రెమ్యునరేషన్ కి ఒప్పుకున్నాడు.

Telugu Dil Raju, Liger, Tollywood-Movie

ఇప్పుడు అదే విజయ్ దేవరకొండ పాలిట శాపంగా మారింది.ఆయన నడుస్తున్న మరో సినిమాకి కూడా చాలా తక్కువ మొత్తంలోనే దిల్ రాజు పారితోషకాన్ని ఇస్తున్నాడట.ఒక సినిమా పోతే ఏముంది మరో సినిమాతో డబ్బు సంపాదించుకోవచ్చు అని ఉద్దేశంతో దిల్ రాజు విజయ్ దేవరకొండ తో మరో సినిమా చేస్తున్నాడు.అయితే విజయ్ లాంటి ఒక స్టార్ హీరో పారితోషకాన్ని తగ్గించుకోవడమే చాలా విచిత్రంగా అనిపిస్తుంది.

ఒకవేళ విజయ్ దేవరకొండ లైన్లో పెట్టిన తదుపరి 2, 3 సినిమాలు విజయాలు సాధిస్తే ఓకే కానీ లేకపోతే ఆయన కెరియర్ కచ్చితంగా కొలాప్స్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube