ఆఫర్లు లేక సిరి హన్మంత్ అలా చేసింది.. వైరల్ అవుతున్న నూకరాజు షాకింగ్ కామెంట్స్!

తెలుగు సినీ ప్రేక్షకులకు బిగ్ బాస్ బ్యూటీ సిరి హనుమంతు( Siri Hanumanth ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.మొదట సోషల్ మీడియాలో షార్ట్ ఫిల్మ్స్, డబ్ స్మాష్ వీడియోల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె ప్రస్తుతం జబర్దస్త్ షో కి యాంకర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

 Nukarajus-shocking-comments-on-siri-hanumanth, Big Boss, Nukaraju, Shocking Comm-TeluguStop.com

బిగ్ బాస్ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న సిరి హనుమంతు జబర్దస్త్ లో చేసి ప్రేక్షకులకు మరింత చేరువ అయింది.ఇది ఇలా ఉంటే తాజాగా జబర్దస్త్ కి సంబంధించిన ఒక ప్రోమోని విడుదల చేశారు.

Telugu Big Boss, Jabardasth, Nukaraju, Siri Hanumanth-Movie

ఆ ప్రోమోలో నూకరాజు( Jabardast Nukaraju ) చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.నూకరాజు తన స్కిట్‌లో చెప్పులు కుట్టే వ్యక్తిగా కనిపిస్తాడు.స్కిట్‌లో భాగంగా జడ్జ్‌గా ఉన్న కృష్ణ భగవాన్ పై పంచులు వేసి నవ్విస్తాడు.ఆయనకు షూటింగ్ కు వెళ్ళడానికి టైమ్ అవుతుంది.త్వరగా చెప్పులు ఇంటికి పంపించాలి అంటూ త్వర త్వరగా కవర్ ఓపెన్ చేసి చెప్పులను బయటకు తీస్తాడు.చూసే సరికి అందులో ఒకటి అమ్మాయిది, మరొకటి అబ్బాయి చెప్పు ఉంటుంది.

దీంతో అయ్యో ఆయన రాత్రి హడావిడిగా కన్ఫ్యూజ్ అవడం వలన ఇలా పంపినట్లు ఉన్నాడంటూ సరదాగా జోక్ చేస్తారు.

Telugu Big Boss, Jabardasth, Nukaraju, Siri Hanumanth-Movie

అలాగే తర్వాత ఇంకో జత చెప్పులు తీసుకుని ఇవి ఎవరి చెప్పులు ఇలా అరిగిపోయాయని మరో కమెడియన్ అడగగా, దానికి నూకరాజు సమాధానం ఇస్తూ.సిరివి అవకాశాల కోసం తిరిగి తిరిగి ఇలా అయిపోయాయి అంటూ చెప్తాడు.మరి అవకాశం వచ్చిందా అని అడగ్గా మోకాళ్ళు అరిగిపోయాయి అంటూ పంచ్ వేస్తాడు.

ప్రస్తుతం స్కిట్‌లో ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట ట్రోలర్స్ ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. బిగ్ బాస్‌( Big Boss )కు వెళ్లి వచ్చాక చాలా మందికి ఆఫర్స్ రావడం లేదు అనే వార్తలు వస్తున్నాయి.

సిరి కూడా అలాంటి సిట్యువేషన్ ఫేస్ చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube