సీతా రామం సినిమా తర్వాత మృణాల్ ఎందుకు బిజీ అవ్వలేదు?

మృణాల్ ఠాకూర్( Mrunal Thakur )చాలా చిన్న వయసులో నటించాలనే కోరిక ఉన్నప్పటికీ కుటుంబం నుంచి ఉన్న కొన్ని కండిషన్స్ కారణంగా సినిమా ఇండస్ట్రీకి కాకుండా తొలుత టెలివిజన్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.తర్వాత ఎలాగోలా అందరిని ఒప్పించి సినిమాల్లో కూడా నటించడం మొదలుపెట్టింది.

 Why Mrunal Takur Is Not So Busy In Tollywood ,sita Ramam, Mrunal Thakur , Dul-TeluguStop.com

హిందీ సినిమా పరిశ్రమలో కొన్ని సినిమాల్లో నటించడం తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమకి ఎంట్రీ ఇచ్చింది.హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన సీతా రామం సినిమా( Sita Ramam ) తర్వాత మృణాల్ ఠాగూర్ పేరు టాలీవుడ్ లో మారుమోగిపోయింది.

Telugu Bollywood, Dulquer Salmaan, Nanna, Mrunal Thakur, Nani, Sita Ramam, Tolly

అయితే ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయింది.దాంతో హీరోయిన్ మృనాల్ ఠాగూర్ చాలా పెద్ద హీరోయిన్ అయిపోతుందని అందరూ అనుకున్నారు.బాలీవుడ్ నుంచి ఇంపోర్ట్ అయిన ఈ అమ్మడు సౌత్ ఇండియా ద్వారా గుర్తింపు పొందితే పాన్ ఇండియా స్థాయిలో పెద్ద సినిమాలు చేయొచ్చు అనే కలలు కూడా కంది.అనుకున్నట్టుగానే హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ సినిమాల్లో హీరోయిన్ గా ఎంపిక అయింది.

ఈ రెండు సినిమాల్లో హాయ్ నాన్న( Hi Nanna ) పరవాలేదనిపించినా విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ మాత్రం డిజాస్టర్ కావడంతో మృనాల్ కెరియర్ ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారిపోయింది.

Telugu Bollywood, Dulquer Salmaan, Nanna, Mrunal Thakur, Nani, Sita Ramam, Tolly

ప్రస్తుతం ఏ అమ్మడు టాలీవుడ్ లో ఏ ఒక్క చిత్రంలోను నటించడం లేదు.హిందీలో ఓ సినిమా చేస్తున్నప్పటికీ తెలుగు సినిమా మేకర్ మాత్రం ఈమె వైపు చూడకపోవడం విశేషం.ఇక ఫ్యామిలీ స్టార్ పరాజయం కూడా ఆమె కెరియర్ పై గట్టిగానే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సీతారామం వంటి ఒక అద్భుతమైన సినిమాలో నటించిన మృణాల్ తెలుగులో ఇంత తొందరగా కెరియర్ ముగించేస్తుందా అంటే అదే అనుమానమే.అందుకే మోడలింగ్ అని ఫోటోషూట్స్ అంటూ హాట్ షూస్ చేస్తూ అందాల ఆరబోత విందుల ఇస్తోంది తన అభిమానులకు.

మరి ఈ అమ్మడు కష్టాన్ని గమనించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో మళ్ళీ బిజీ అవుతుందా లేక హిందీకి వెళ్ళిపోయి అక్కడ నటిస్తుందా అనే విషయం తెలియాలంటే మరికొన్ని రోజుల పాటు వేచి చూడాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube