ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది.ఈ శనివారం ప్రచారంకి చివరి రోజు.
దీంతో ప్రధాన పార్టీల నేతలు ఎన్నికల ప్రచారాలలో సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.ఇదే సమయంలో ప్రజలకు సంచలన హామీలు ప్రకటిస్తున్నారు.
ఏపీ సీఎం వైసీపీ అధినేత జగన్( YS Jagan Mohan Reddy ) 2019లో కంటే ఈసారి ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.ఎట్టి పరిస్థితులలో అధికారం కోల్పోకూడదని వ్యూహాత్మకంగా ఎన్నికలను ఎదుర్కొంటున్నారు.
ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకోవటంతో రోజుకి మూడు సభలలో పాల్గొంటున్నారు.మంగళవారం గాజువాక( Gajuwaka )లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ క్రమంలో సీఎం జగన్ సంచలన ప్రసంగం చేశారు.

వైసీపీ అధికారంలోకి వచ్చాక 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినట్లు స్పష్టం చేశారు.అంతేకాకుండా 17 మెడికల్ కాలేజీలు కడుతున్నట్లు పేర్కొన్నారు.13 జిల్లాలను…26 జిల్లాలుగా మార్చటం జరిగింది.₹4400 కోట్లతో ఫిషింగ్ హార్బర్ నిర్మాణం జరుగుతుంది.ఇదంతా అభివృద్ధి కాదా.? విశాఖను పరిపాలన రాజధానిగా చేశాం.59 నెలలలో ఎన్నో మార్పులు తీసుకొచ్చాం.స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మా వల్లే ఆగిందని చెప్పుకొచ్చారు.
ఐదేళ్ళుగా నేను ఒప్పుకోలేదు కాబట్టే.స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ ప్రైవేటీకరణ జరగలేదు.
పొరపాటున కూటమికి ఓటేస్తే.స్టీల్ ప్లాంట్ ఆమోదం తెలిపినట్టే.
విశాఖ రైల్వే జోన్ కి మేం భూములు ఇచ్చిన కేంద్రం తీసుకోలేదు.మోడీ, చంద్రబాబు, పవన్ కలిసి డ్రామాలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జూన్ 4 తర్వాత నేను వైజాగ్ లోనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని సీఎం జగన్ గాజువాక సభలో కామెంట్లు చేయడం జరిగింది.