ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో కొన్నిరోజుల క్రితం వరకు పేదలకు క్రమం తప్పకుండా అందిన పథకాలు ఇప్పుడు అందడం లేదు.ఫీజు రీయింబర్స్ మెంట్, విద్యాదీవెన, రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ సకాలంలో అందేలా చేయడానికి అనుమతులు ఇవ్వాలని స్క్రీనింగ్ కమిటీ కొన్నిరోజుల క్రితమే ఏపీ ఎన్నికల కమిషన్( AP Election Commission ) కు ప్రతిపాదనలు పంపించగా డబ్బులను ఖాతాలో జమ చేయడానికి ఎన్నికల కమిషన్ అంగీకరించలేదు.

ఎన్నికల కమిషన్ నిర్ణయం అటు రైతులపై, ఇటు విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.అయితే ఈసీ ఈ విధంగా నిర్ణయం తీసుకోవడానికి బాబు, టీడీపీ నేతల ఫిర్యాదులే కారణమని ఏపీ పొలిటికల్ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.పేదలపై చంద్రబాబు కక్ష కట్టారని అందుకే సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో అడ్డు పడుతున్నారని తెలుస్తోంది.ఇప్పటికే టీడీపీ ఫిర్యాదుల వల్ల పింఛన్ల విషయంలో వృద్ధులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు.

ఇప్పుడు ఇతర పథకాల నగదు సకాలంలో జమ అయితే వైసీపీకి( YCP ) ఎక్కడ ప్లస్ అవుతుందో అనే దురుద్దేశంతో బాబు( Chandrababu Naidu ) ఈ పథకాల అమలుకు అడ్డు పడుతున్నాడు.ఫీజు రీయింబర్స్ మెంట్, విద్యాదీవెన, రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ పథకాలు కొత్త పథకాలు అయ్యి ఉంటే అభ్యంతరం చెప్పినా బాగుండేది.గత నాలుగేళ్ల నుంచి అమలవుతున్న పథకాల విషయంలో కక్షపూరితంగా వ్యవహరించి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనే ప్రశ్నకు టీడీపీ నేతలే సమాధానం చెప్పాలి.ఖరీఫ్ కు సన్నద్ధమవుతున్న రైతులు సబ్సిడీ నిలిచిపోవడం వల్ల తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు.
ఎన్నికలు జరగకముందే తెలుగుదేశం నేతలు ప్రజలను ఇంతలా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు రైట్ అని టీడీపీ నిర్ణయాలు ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని రాజకీయ విశ్లేషకులు సైతం కామెంట్లు చేస్తున్నారు.టీడీపీ నేతలు ఇలాంటి పనుల వల్ల న్యూట్రల్ ఓటర్ల చేత కూడా విమర్శలు మూటగట్టుకుంటున్నారు.