తెలుగు సినీ ప్రేక్షకులకు యాంకర్ రష్మీ( Rashmi Gautam ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.రష్మీ ప్రస్తుతం ఒక వైపు సినిమాలో నటిస్తూనే మరొకవైపు యాంకర్ గారు రాణిస్తున్న విషయం తెలిసిందే.
ఇటు బుల్లితెర ప్రేక్షకులను అటు వెండితెర ప్రేక్షకులను అలరిస్తోంది.జబర్ధస్త్ ద్వారా మంచి పాపులారిటీ తెచ్చుకుంది.
ప్రస్తుతం జబర్దస్త్ షో తో పాటు ఎక్స్ట్రా జబర్దస్త్ అలాగే పండుగ ఈవెంట్లకు యాంకర్ గా వ్యవహరిస్తోంది.ఇకపోతే రష్మీ గౌతమ్ జంతు ప్రేమికురాలన్న విషయం తెలిసిందే.
ఆమె జీవహింసను వ్యతిరేకిస్తారు.
మూగజీవాలను ఆహారం కోసం లేదా, ఇతర కారణాలతో హింసిస్తే ఆమె తట్టుకోలేరు.జంతువుల రక్షణ కోసం ఆమె చాలా కాలంగా పోరాటం చేస్తూనే ఉన్నారు.జీవులను ఏ రూపంలో కూడా ఇబ్బందులకు గురి చేయకూడదని నమ్మే రష్మీ వీగన్ గా మారింది.
ఆమె మాంసాహారమే కాదు పాలు, పాల ఉత్పత్తులు, గుడ్లు కూడా తినరు.అయితే మూగ జీవాలను సపోర్ట్ చేస్తూ రష్మీ చేసే సోషల్ మీడియా( Social media ) కామెంట్స్ ట్రోల్స్ కి గురవుతూ ఉంటుంది.
గత ఏడాది హైదరాబాద్ లో ఒక బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసి చంపాయి.ఈ ఘటనలో బాలుడు తల్లి దండ్రులదే తప్పని రష్మీ గౌతమ్ వాదించింది.
దాంతో రష్మీని దారుణంగా ట్రోల్ చేశారు.అలాగే బక్రీద్ పండగకు జరిగే గోవధను కూడా ఆమె వ్యతిరేకించడం వివాదాస్పదం అయ్యింది.తాజాగా రష్మీ గౌతమ్ ఓ వ్యక్తి ఎద్దును కాల్చి చంపుతున్న వీడియో షేర్ చేసింది.ఇది దారుణం అంటూ వాపోయింది.మనం ఇలాంటివి జరగకుండా ఎందుకు ఆపలేకపోతన్నామని ఆమె ప్రశ్నించారు.ఈ పోస్ట్ పై ఒక నెటిజెన్ స్పందించారు.
ఆడపిల్లను రేప్ చేస్తున్నారు.బట్టలు ఊడదీసి నగ్నంగా తిప్పుతున్నారు.
చంపేస్తున్నారు.అలాంటి దారుణాల మీద స్పందించని నువ్వు ఒక ఎద్దును చంపితే కామెంట్స్ చేస్తున్నావు.
నిన్ను ఏ చెప్పుతో కొట్టాలి అంటూ కామెంట్ చేశాడు.అయితే ఈ కామెంట్ పై స్పందించిన రష్మీ గౌతమ్… ఇవాళ ఎద్దును చంపిన వాడు రేపు మీ పిల్లలను చంపుతాడు.
వాడికి మనిషికి పశువుకు తేడా తెలియదు బ్రెయిన్ వాడు అని ఘాటుగా రిప్లై ఇచ్చింది.