తిరుమల తిరుపతి దేవస్థానంలో జనవరి 2వ తేదీన వైకుంఠ ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి.జనవరి 1న అర్ధరాత్రి 1.30 గంటల నుంచి వైకుంఠ ఏకాదశి దర్శనాలను టీటీడీ కల్పించనుంది.మొదట ప్రొటోకాల్ పరిధిలోని వీఐపీ భక్తులకు దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు.
ఉదయం 5 గంటల నుంచి సామాన్య భక్తుల సర్వదర్శనం ప్రారంభంకానుంది.ఇప్పటికే ఆన్ లైన్ ద్వారా రోజుకు 25 వేల ప్రత్యేక దర్శనం టికెట్లను విక్రయించినట్లు టీటీడీ తెలిపింది.
రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి తిరుపతిలోని తొమ్మిది కేంద్రాల్లో సర్వ దర్శనం టైం స్లాట్ టోకెన్ల జారీని టీటీడీ ప్రారంభించనుంది.ఇందులో భాగంగా రోజుకు 50 వేల టోకెన్ల చొప్పున 10 రోజులకు 5 లక్షల టోకెన్లను జారీ చేయనున్నారు.
ఈ మేరకు 24 గంటలూ కౌంటర్స్ తెరిచి ఉంటాయని టీటీడీ వెల్లడించింది.ఈ నేపథ్యంలో వైకుంఠ ఏకాదశి వేడుకలకు కావాల్సిన ఏర్పాట్లను ముమ్మరంగా చేస్తున్నారు.
భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు.