రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో వైసీపీ ఎవరికీ మద్దతు ఇస్తుంది అన్నది గత కొన్ని రోజుల నుండి రాష్ట్ర, జాతీయ రాజకీయాలలో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.ఇటువంటి తరుణంలో రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్లు వైఎస్ఆర్సిపి ప్రకటించింది.
ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకి మద్దతు ఇస్తున్నట్లు అధికారికంగా ప్రకటన చేయడం జరిగింది.గిరిజన మహిళకు రాష్ట్రపతి అవకాశం ఇవ్వడం శుభ పరిణామమని వైసీపీ పేర్కొంది.
ప్రస్తుతం రాష్ట్రపతి రామ్ నాథ్ కొవింద్ పదవీ కాలం పూర్తి కావడంతో రాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది.
ఈ క్రమంలో ఎన్డీఏ ద్రౌపది ముర్మునీ తమ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది.
ఈనెల 24వ తారీఖు నాడు ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి నామినేషన్ వేయనున్నారు.ఇటువంటి తరుణంలో రాష్ట్రపతి ఎన్నిక విషయంలో వైసీపీ తమ మద్దతు ద్రౌపది ముర్ముకి అంటూ ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది.
ఎన్డీఏ గతంలో దళిత వర్గానికి చెందిన రామ్నాథ్ కోవింద్ కి రాష్ట్రపతిగా నిలబెట్టగా, ఇప్పుడు గిరిజన సామాజిక వర్గానికి చెందిన ద్రౌపది ముర్ముకి రాష్ట్రపతి అయ్యే అవకాశం ఇవ్వటం జాతీయ రాజకీయాల్లో సంచలనంగా మారింది.ఇదిలా ఉంటే జూన్ 24 నాడు ఏపీ కేబినెట్ సమావేశం జరగాల్సి ఉండగా.
సీఎం జగన్ ఢిల్లీ వెళుతూ ఉండటంతో క్యాబినెట్ మీటింగ్ క్యాన్సిల్ అయింది.