టాలీవుడ్ లో టాప్ హీరోగా కొనసాగుతున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు.క్రిష్ట నట వారసుడిగా అడుగు పెట్టిన ఆయన.
అతి కొద్ది కాలంలోనే సొంత ఇమేజ్ తో మంచి హీరోగా ఎదిగాడు.పలు సక్సెస్ ఫుల్ సినిమాలతో ముందుకు సాగుతున్నాడు.
తాజాగా ఆయన సర్కారు వారి పాట అనే సినిమాలో హీరోగా చేస్తున్నాడు.తన తండ్రి క్రిష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాను చేస్తున్నట్లు అఫీషియల్ గా ప్రకటించాడు మహేష్ బాబు.
దీంతో ఆయన అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు.సోషల్ మీడియాలో తెగ హడావిడి చేశారు.
ఈ సినిమాకు ముందు ఆయన చేసిన మూడు సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి.ఒక సినిమాను మించి మరొక సినిమా బ్లాక్ బస్టర్ హ్యాట్రిక్ ను అందుకున్నాయి.
మహేష్ బాబు కూడా తన అద్భుత నటనతో ఫ్యాన్స్ ను తెగ ఆకట్టుకున్నాడు.వరుస విజయాలతో దూసుకెళ్తూ అందరి చేత వారెవ్వా అనిపించుకుంటున్నాడు.అటు గత నాలుగు సినిమాలను పరిశీలిస్తే ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ మనకు కనిపిస్తుంది.ఇంతకీ అదేంతో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

సర్కారు వారి పాట, సరిలేరు నీకెవ్వరు, మహర్షి, భరత్ అనే నేన మహేష్ బాబు తాజా సినిమాలు.ఈ నాలుగు సినిమాలను చూస్తే.ఆయా సినిమాల్లోని తొలి అక్షరాలు.ఎస్ ఎస్ ఎం బి అని వస్తున్నాయి.అంటే సూపర్ స్టార్ మహేష్ బాబు అనే పేరు కూడా కనిపిస్తుంది.ఇలా తన గత సినిమాలను కలిపి చూస్తే ఈ గుర్తింపు లభిస్తుంది.

అనుకోకుండా ఈ పేరు వచ్చినా ఆయన అభిమానులు మాత్రం ఈ విషయాన్ని చెప్తూ సోషల్ మీడియాలో మస్త్ హల్ చల్ చేస్తున్నారు.ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్ మీడియాలో సూపర్ ఫాస్ట్ గా వైరల్ అవుతుంది.గత మూడు సినిమాలు సక్సెస్ ఫుల్ గా విజయాన్ని అందుకుని హ్యాట్రిక్ కొట్టిన మహేష్ బాబ ఈ సినిమాతోని మరో హిట్ ను తనఖాతాలో వేసుకుంటాడో? లేదో? చూడాలి.